సాధారణంగా ఒత్తిడి, అలసట సహజంగా అందరికి ఎదురయ్యే సమస్యలు. వీలైనంత వరకు వాటి నుండి విముక్తి చెందుటకు ప్రయత్నిస్తుంటారు. ముందుగానే బీపీ ఉన్నవారికైతే హైబీపీ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి హైబీపీ తగ్గించుటకు ప్రతిరోజూ యోగా, ధ్యానం, వ్యాయామం చేయడం, పుస్తకాలు చదవడం, సంగీతం వినడం వంటివి చేస్తే మంచిది.
అధికంగా పండ్లు, కూరగాయలు, పాలు, నట్స్ వంటి పదార్థాలు తీసుకుంటే హైబీపీ అదుపులో ఉంటుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా 30 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే హైబీపీ తొలగిపోతుందని పరిశోధనలో వెల్లడైంది. మధుమేహం ఉన్నవారికి హైబీపీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువలన క్రమంగా వేళకు నిద్రించాలి.
ముఖ్యంగా భోజనం వేళకు చేయాలి. అప్పుడే ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అలానే అధిక బరువు ఉన్నవారికి కూడా హైబీపీ పెరుగుతుంది. కనుక బాడీ మాస్ ఇండెక్స్ 20 నుండి 25 మధ్యలో ఉండేలా చూసుకోవాలి.