Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అవిసె నూనె ఆరోగ్య ప్రయోజనాలు...

అవిసె నూనె ఆరోగ్య ప్రయోజనాలు...
, సోమవారం, 8 అక్టోబరు 2018 (16:30 IST)
అవిసె గింజల నూనెలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. వీటి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.

రక్తపోటు నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. మధుమేహం, కీళ్ల నొప్పులను అదుపులో ఉంచుతుంది. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాట్స్ మాత్రమే కాకుండా ఇతర పోషక విలువలు కూడా ఉన్నాయి.
 
ఈ నూనెలోని ఫైబర్ పదార్థం జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఈ అవిసె గింజల్లోని లిగ్నాన్స్, ఈస్ట్రోజెన్స్ ఎముకల బలానికి మంచిగా దోహదపడుతాయి. ఈ గింజల్లో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అందుకునే ఈ నూనెతో పాటు అవిసె గింజలను ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
ఈ నూనెను వాడేటప్పుడు వేడి చేయకుండా ఉండేందుకు సలాడ్లలో కానీ, విడిగా కానీ తీసుకోవడం మంచిది. అవిసె గింజలను పొడిచేసుకుని కూరలు వండేశాక చల్లుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ పొడిని రొట్టెల పిండిలో కలిపి చపాతీలు కూడా చేసుకోవచ్చును. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త కోసం శృంగారంలో తృప్తి చెందుతున్నట్లు ముఖం పెట్టేవాళ్లు ఎంతమందో తెలుసా?