Publish Date: Mon, 22 Apr 2019 (16:50 IST)
Updated Date: Mon, 22 Apr 2019 (16:58 IST)
చిన్నా పెద్దా తేడా లేకుండా వచ్చేది జలుబు. ఇది చిన్న పిల్లలపై అధిక ప్రభావం చూపుతుంది. సునాయాసంగా సంక్రమిస్తుంది. జలుబు వలన దగ్గు, తలనొప్పి, తుమ్ములు వంటి సమస్యలు ఎదురవుతాయి. అంత త్వరగా నయంకాదు. అందుకు వైద్య చికిత్సలు తీసుకుంటుంటారు. అయినా కూడా ఎలాంటి లాభం లేదని బాధపడుతుంటారు. జలుబును నివారించడానికి ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలు ఉన్నాయి.
శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవడం వలన జలుబు, తుమ్ములు, దగ్గు వంటి సమస్యలు ఏర్పడతాయి. మనం తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు చాలా తక్కువగా ఉంటాయి. ఉసిరికాయలు ఈ సమస్యకు మంచి పరిష్కారం. ప్రతిరోజూ ఉసిరికాయను నేతిలో వేయించుకుని తేనెలో కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఇంగువ చూర్ణాన్ని వేడినీటిలో మరిగించుకుని అందులో కొద్దిగా ఆవునెయ్యి కలుపుకుని ప్రతిరోజూ మూడుపూటలా సేవిస్తే ఆయాసం, తలనొప్పి వంటి సమస్యలు దరిచేరవు. అయినా తగ్గకుంటే వాము చూర్ణాన్ని, పటిక బెల్లాన్ని వేడినీళ్లల్లో మరిగించుకుని తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
సందీప్
Publish Date: Mon, 22 Apr 2019 (16:50 IST)
Updated Date: Mon, 22 Apr 2019 (16:58 IST)