Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్లైట్ జర్నీకి ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

సాధారణంగా ప్రయాణం అంటే జర్నీ సమయంలో కడుపునిండా లాగించేందుకు వివిధ రకాల చిరుతిండ్లను తమ వెంట తీసుకెళుతుంటారు. మరికొందరు అయితే, టిఫిన్ల కొద్దీ వివిధ రకాల భోజనాలను కూడా తయారు చేసుకుని వెళుతుంటారు.

Advertiesment
flight journey
, శుక్రవారం, 8 జూన్ 2018 (12:40 IST)
సాధారణంగా ప్రయాణం అంటే జర్నీ సమయంలో కడుపునిండా లాగించేందుకు వివిధ రకాల చిరుతిండ్లను తమ వెంట తీసుకెళుతుంటారు. మరికొందరు అయితే, టిఫిన్ల కొద్దీ వివిధ రకాల భోజనాలను కూడా తయారు చేసుకుని వెళుతుంటారు. అయితే బస్సులు, రైళ్లు, కార్లలో ప్రయాణించేవారు ఎలాంటి ఆహారాన్నైనా తమ వెంట తీసుకెళ్లవచ్చు. కానీ, ఫ్లైట్ జర్నీ చేసే మాత్రం ఆచితూచి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఫ్లైట్ జర్నీలో తీవ్ర అసౌకర్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల విమాన జర్నీకి ముందు లేదా విమాన జర్నీలో తినకూడని ఆహార పదార్థాలు ఏంటో ఓసారి పరిశీలిద్దాం.
 
1. కూల్ డ్రింక్స్... విమాన ప్రయాణంలో లేదా ప్రయాణానికి ముందు శీతలపానీయాలను అస్సలు తాగరాదు. ఇవి గ్యాస్, అసిడిటీ సమస్యలకు కారణమవుతాయి. 
 
2. సాధారణంగా ప్రయాణాల్లో ఆపిల్స్ ఆరగిస్తుంటారు. కానీ, విమానంలో ప్రయాణించడానికి ముందు ఆపిల్స్‌ను తినరాదు. తింటే వీటిలో ఉండే ఫైబర్ జీర్ణంకాక సమస్యలను సృష్టిస్తుంది. 
 
3. ప్రతి ఒక్కరూ ఇష్టపడేది కాఫీ. ఇది మీకు ఎంత ఇష్టమైనా సరే ఫ్లైట్ జర్నీలో మాత్రం తాగరాదు. అది జీర్ణాశయంలో ఇబ్బందులను సృష్టిస్తుంది. తలనొప్పి, వికారం, డీహైడ్రేషన్ సమస్యలకు దారితీస్తుంది. 
 
4. నిజానికి బ్రొకోలి మంచి ఆరోగ్యకరమైన ఆహారం. కానీ దీన్ని విమానం ఎక్కేముందు మాత్రం తినరాదు. తింటే గ్యాస్ సమస్య బాధిస్తుంది. పైగా, త్వరగా జీర్ణంకాదు. అందువల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. 
 
5. ఫ్రై చేసిన వంటకాలు.. ఫ్రై చేసేందుకు ఎక్కువ ఆయిల్స్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. అందువల్ల ఎక్కువ నూనెతో తయారు చేసిన ఫ్రై పదార్థాలను ఆరగించడం వల్ల అసిడిటీని కలిగిస్తాయి. కడుపులో మంట, వికారం, నొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా, ఫ్రై చేసిన పదార్థాల్లో ఉండే సోడియం శరీరంలో ఎక్కువగా నీటిని స్టోర్ చేసుకుంటుంది. దీంతో ముఖ్యంగా పాదాల వద్ద నీరు చేరి అవి ఉబ్బిపోతాయి. విమానంలో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. 
 
6. మద్యపానం.. చాలా విమానాల్లో ఆల్కహాల్ సరఫరా చేస్తారు. కానీ, మద్యం సేవించడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. హ్యాంగోవర్ సమస్య తలెత్తుతుంది. దీనికి జెట్‌లాగ్ తోడైతే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అందువల్ల ఫ్లైట్ జర్నీలో మద్యపానానికి దూరంగా ఉండటం ఉత్తమం. 
 
7. విమానాల్లో ప్రయాణించే వారు మాంసం తినరాదు. తింటే జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పట్టి గ్యాస్, అసిడిటీ వస్తాయి. ప్రయాణంలో అసౌకర్యంగా ఉంటుంది. అలాగే, అధిక కారంతో తయారు చేసి పదార్థాలు కూడా ఆరగించరాదు. వీటివల్ల జీర్ణాశయంలో అసౌకర్యం కలిగేందుకు అవకాశం ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ గడియారం ఆడదా..?