కంటి చూపుకి, మలబద్ధకానికి ఆకుకూరలు ఎంతో బాగా పనిచేస్తాయని తెలుసు, కానీ ఆకుకూరల్లో పొన్నగంటి కూరది ప్రత్యేక స్థానం. అన్ని ఆకుకూరల్లో ఉండే గుణాలు దీనికి ఉన్నాయి. కంటి చూపు కోసం మాత్రమే కాకుండా, వీర్యకణాల ఉత్పత్తి తక్కువగా ఉండి సంతాన సమస్యతో బాధపడే వారు దీన్ని బాగా తినాలి.
దగ్గు, ఆస్తమాను నివారించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. తాజా ఆకుల నుండి కొద్దిగా రసాన్ని తీసుకుని వెల్లుల్లితో తీసుకుంటే దీర్ఘకాలిక ఆయాసం, దగ్గు తగ్గుతుంది. నరాలు లాగడం, వెన్ను నొప్పిపెట్టడం వంటి సమస్యలకు పొన్నగంటి కూర దివ్యౌషధం.
షుగర్‌తో బాధపడే వారు పొన్నగంటి కూర తింటే కణజాలం దెబ్బతినకుండా మరియు కంటి చూపు మందగించకుండా రక్షిస్తుంది. పురుషులలో వీర్య కణాల వృద్ధికి తోడ్పడుతుంది. మొలలతో బాధపడే వారు ఈ ఆకుల రసాన్ని ముల్లంగి ఆకుల రసంలో కలుపుకుని రోజూ త్రాగితే ఫలితం ఉంటుంది. పొన్నగంటి కూర ద్వారా మరిన్ని ప్రయోజనాలు పొందాలంటే ఇతర నూనెలతో కాకుండా ఆవు నెయ్యితో వండుకు తినాలి.