బూడిద గుమ్మకాయ బరువును తగ్గించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. బూడిద గుమ్మకాయ జ్యూస్‌లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, క్యాల్షియం, పొటాషియం వంటి ధాతువులు వున్నాయి. యాంటీ-యాక్సిడెంట్లు, నీటి శాతం అధికం. బూడిద గుమ్మడిలో పీచు అధికంగా వుంటుంది. తద్వారా శరీర బరువు తగ్గుతుంది.
బూడిద గుమ్మడి జ్యూస్‌ను రోజూ పరగడుపున తీసుకుంటే ఒబిసిటీ దరిచేరదు. ఒంట్లోని వ్యర్థాలను తొలగిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు రోజు ఉదయం 200 మి.లీ బూడిద గుమ్మడి రసాన్ని తీసుకోవాలి.
బూడిద గుమ్మకాయ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. మధుమేహం, గుండెపోటును నియంత్రిస్తుంది. శరీర ఉష్ణాన్ని తగ్గిస్తుంది. బూడిద గుమ్మడి రసంలో తేనెను కలిపి రోజూ ఉదయం, సాయంత్రి తీసుకుంటే రక్తం శుద్ధి అవుతుంది. అనారోగ్య సమస్యలు ఏర్పడవు. పైల్స్, యూరినల్ సంబంధిత వ్యాధులుండవు. కిడ్నీ సంబంధిత సమస్యలు తొలగిపోవాలంటే 120 మిల్లీ బూడిద గుమ్మడి రసంలో ఓ టేబుల్ స్పూన్ తేనెను కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
బూడిద గుమ్మడితో జ్యూస్ ఎలా చేయాలంటే..?
బూడిద గుమ్మడి గుజ్జు అరకేజీ తీసుకుని అందులో తగినంత నీటిని చేర్చి మిక్సీలో రుబ్బుకోవాలి. తర్వాత వడగట్టి.. తేనె రెండు స్పూన్లు చేర్చి తీసుకుంటే బరువు తగ్గిపోతుంది.