Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మానసిక రోగాలు దూరమవ్వాలంటే ఆవు నెయ్యిని?

మానసిక రోగాలు దూరమవ్వాలంటే ఆవు నెయ్యిని?
, గురువారం, 21 మే 2020 (21:08 IST)
మనిషి జీవించినంతకాలం ఆరోగ్యంగా ఉండాలన్నా, పుష్టిగా సంపూర్ణ ఆరోగ్యవంతునిగా బ్రతకాలన్నా ప్రతిరోజూ మన ఆహారంలో ఆవు నెయ్యిని తప్పనిసరిగా వాడాలి. డబ్బు లేకపోతే అప్పు చేసైనా ఆవు నెయ్యిని కొనుక్కుని ప్రతిరోజూ భుజించాలని పెద్దలు చమత్కరిస్తుంటారు. డబ్బును సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం ఒక్కసారి చేజారిపోతే చాలా ప్రమాదం అని పెద్దలు హెచ్చరిస్తూ అలా చెబుతుంటారు. 
 
ఇంగ్లీషు వైద్య ప్రభావం పెరిగి, స్వదేశీ వైద్యం మెరుగైన కారణంగా నెయ్యి వాడకం వార్తిగా తగ్గిపోయింది. రోజురోజుకీ రోగల సంఖ్య కూడా పెరిగిపోయింది. ఈనాడు రోగం లేని మనిషి లేడని చెప్పలేము. ప్రకృతిలో లభించే అవసరమైన పదార్థాన్ని తీసుకుంటే ఎంతో మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
ఆవునేతిని ప్రతిరోజు వాడటం వల్ల శరీరంలో ఉష్ణాన్ని సమంగా రగిలించి థాతువులను సక్రమంగా పోషించి ఆయుర్థాయాన్ని అద్భుతంగా కాపాడుతుంది. ఆవు నెయ్యి కొంచెం లేత పసుపు రంగుంలో ఉంటుంది. అందులో కెరోటిన్ విటమిన్ ఎ కు పూర్వరూపం. ఈ పదార్థం కారణంగానే ఆవు పాలల్లో ఆవునేతిలో ఎ విటమిన్ పుష్కలంగా తయారవుతుంది. మిగిలిన నేతుల్లో విటమిన్ ఎ ఉండదు. కాబట్టే వాటికి పసుపు, పచ్చ రంగు ఉండదు. అందువల్లే ఆవు నెయ్యి చాలా ఉత్తమమైందట.
 
ఆవు నెయ్యి భుజించగానే అతి వేగంగా శరీరంలోని అణువణువులోకి చొచ్చుకుపోతుంది. శక్తిని అందిస్తుంది. పేరి నెయ్యి మంచిదా..? లేక కరిగిన నెయ్యి మంచిదా అన్న ప్రశ్న ఉదయించడం సహజం. వెన్నె వేడి చేయడంలోనే కొంత విటమిన్ నశిస్తుంది. మళ్ళీ వెచ్చ చేయడం వల్ల విటమిన్ ఎ పూర్తిగా హరించుకుపోతుందట. కాబట్టి వెచ్చ పెట్టేటప్పుడు పాత్ర మీద ఏదైనా గట్టి మూత పెట్టడం ద్వారా విటమిన్ ఎను కాపాడుకోవచ్చట. 
 
ఆరోగ్యానికి శాశ్వత పునాది ఆవు నెయ్యి. మానసిక దోషాలను, కాలుష్యాలను పోగొట్టడంలో ఆవు నెయ్యి అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మానసిక ఉద్రేకాలను, ఆందోళనలను, బలహీనతలను సమర్థవంతంగా అరికట్టి, మనస్సుకు సామర్థ్యాన్ని ప్రశాంతత్వాన్ని అందిస్తుందట. అన్ని సమస్యలకు మూలమైన రజోగుణాన్ని తమో గుణాన్ని తగ్గించి సాత్విక తత్వాన్ని పెంపొందించి మానవుణ్ణి మేధావిగా చురుకుగా, కాంతివంతుడుగా మార్చి సంపూర్ణ జీవితానికి శాశ్వత పునాది వేసే శక్తి ఆవు నెయ్యిలో అద్వితీయంగా ఉందట. ఏ వ్యాధి రాకుండా అకాల వార్థక్యం రాకుండా శక్తి సన్నగిల్లకుండా కాపాడుతుందట ఆవు నెయ్యి.
 
మేహరోగాలలో ఆవు నెయ్యి అద్భుతంగా పనిచేస్తుందట. మూలశంక, ఉన్మాదము, పాండు రోగాలను దూరంగా ఉంచుతుందట. కేవలం శరీరానికే కాకుండా కళ్ళకు మంచి దృష్టిని కూడా ప్రసాదిస్తుందట. రోజూ క్రమం తప్పకుండా ఆవు నేతిని వాడటం వల్ల ఎముకల పటుత్వం, ఎముకల్లో ఉన్న మూలుగు రూపాంతరం చెందుతుందని, వాక్కును స్పష్టంగా పలికిస్తుందని ఆయుర్వేదం స్పష్టంగా చెబుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరివేపాకును నీడలోనే ఎండబెట్టాలట.. ఒత్తిడికి చెక్ పెట్టాలంటే?