Publish Date: Fri, 29 Mar 2019 (14:41 IST)
Updated Date: Fri, 29 Mar 2019 (15:49 IST)
ఆకుకూరల్లో ఉండే పోషకాల గురించి మనకు తెలియంది కాదు. ఆకుకూరలు తింటే కంటిచూపు మెరుగుపడుతుందని చాలా మంది చెబుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. వారానికి కనీసం ఒకరోజైనా ఆకుకూరలు తినాలని వైద్యులు చెబుతున్నారు. అయితే పాలకూరలో అన్నింటికంటే విటమిన్-ఇ ఎక్కువగా ఉంటుంది. వారంలో రెండు రోజులు పాలకూర తింటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం ఉంటుంది.
విటమిన్-ఇ తోపాటు పాలకూరలో విటమిన్-సి, ఖనిజ లవణాలు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తహీనతకు మంచి మందు. వ్యాధినిరోధక శక్తిని వృద్ధి చేస్తుంది. హైబీపీని తగ్గించడంలో కూడా పాలకూర సహాయపడుతుంది.
పాలకూరను తింటే జుట్టు అందంగా పెరుగుతుందట. మతిమరుపు దూరమవుతుందట. ఎముకలు పటిష్టంగా మారతాయి. గుండె సమస్యలు, అనేక రకాల క్యాన్సర్‌ల నుండి మనను రక్షిస్తుంది. శారీరక ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకు ఇది చాలా అవసరం. లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణాలు కూడా పాలకూరలో ఉన్నాయి.