Publish Date: Tue, 10 Oct 2023 (20:19 IST)
Updated Date: Tue, 10 Oct 2023 (20:21 IST)
జాజికాయ. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవేస్తుంది. జాజికాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తాంబూలంలో జాజికాయను వేసుకుని సేవిస్తే నోటి దుర్వాసన పోతుంది. పాలలో జాజికాయ పొడిని కలుపుని తాగితే గుండెల్లో నొప్పి, దడ తగ్గుతాయి.
ఈ కాయ మనస్సులోని ఆవేశాన్ని, ఆగ్రహాన్ని, ఉద్రేకాన్ని తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.
గోరువెచ్చని ఆవుపాలతో జాజికాయ పొడిని పురుషులు తాగితే శక్తినిస్తుంది. జాజికాయను తీసుకుంటే దగ్గు, జలుబు, కఫానికి ఔషధంగా పనిచేస్తుంది. మోతాదుకు మించి జాజికాయను తీసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలు రావచ్చు.
అధికంగా వాడితే ఏకాగ్రత కోల్పోవడం, ఎక్కువ చెమట పట్టడం సమస్యలు రావచ్చు. జాజికాయ వాడకం విషయంలో జాగ్రత్త ముఖ్యం, గర్భవతులు దీన్ని ఉపయోగించకూడదు.