జీవితం. మానవుడికి మాత్రమే తెలివిగా జీవించే ఒక అవకాశం. ఈ జీవితంలో పంచ సూత్రాలు పాటిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించేయవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. తక్కువ మాంసాహారం తింటూ ఎక్కువగా శాకాహారం తీసుకోవాలి. తక్కువ చక్కెరను శరీరానికి అందిస్తూ ఎక్కువగా పండ్లను తింటుండాలి.
తక్కువగా డ్రైవింగుకి చోటిస్తూ ఎక్కువగా వాకింగ్ చేస్తుండాలి. దేహానికి తక్కువగా ఒత్తిడి కలిగించేలా పని చేస్తూ ఎక్కువ నిద్రపోవాలి. కోపాన్ని ఎంత నిగ్రహించుకోగలిగితే అంత ఆనందం సొంతమవుతుంది. ఈ ఐదు సూత్రాలు పాటించేవారు జీవితం సుఖమయమవుతుంది.