Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భోజనం చేయుటకు ఉపయోగపడే ఆకులు - వాటిలోని ఔషధ గుణాలు

Advertiesment
Medicinal leaves
, బుధవారం, 10 నవంబరు 2021 (18:37 IST)
కొంతకాలం క్రితం ఒక గ్రామము నందలి బాలురు తీవ్రమైన అతిసార వ్యాధితో బాధపడుతున్నారు. వారికి ఎంత మంచి చికిత్స అందించినను వ్యాధి తీవ్రత తగ్గటం లేదు. వారిని పరిశీలించుటకు వచ్చిన శాస్త్రవేత్తలు వారు ఆహారం తీసికొనుటకు ఉపయోగించుచున్న అల్యూమినియం పాత్రలను ప్రయోగశాలకు పంపినప్పుడు వారి రోగానికి కారణం వారు భుజించు ఆహారం కాదు వారు ఆహారాన్ని వండటానికి ఉపయోగించుచున్న అల్యూమినియం పాత్రలే కారణం అని నిర్దారణకు వచ్చారు. 

ఈ అల్యూమినియం పాత్ర యందు వండబడిన ఆహారం విషపూరితం అగును. అది శరీరం పైన ఒక్కసారిగా తన ప్రభావాన్ని చూపించదు. కొంచం కొంచంగా మనిషి యొక్క ఆరోగ్యాన్ని దెబ్బ తీయును.
 
అల్యూమినియం పాత్ర యందు ఆహారాన్ని ఉడికించడం మూలాన ఆహారం నందలి ఆమ్లములు, అల్యూమినియం లోహము పైన ప్రభావం చూపి అనేక విషసంభంధ రోగాలకు ప్రధానకారణం అగును. ముఖ్యంగా చర్మ సంబంధ, నరాల సంబంధ సమస్యలు అధికంగా వచ్చును. శరీరంనందు కేన్సర్ కూడ వృద్ధిచెందును. 
 
పైన చెప్పినటువంటి సమస్యలు రాకుండా ఉండుటకు ముందుగా మనం ఆహారాన్ని వండే వంట పాత్రలను మార్చవలెను. అదేవిధముగా మనం ఆహారాన్ని భుజించుటకు విస్తరాకులు వాడటం ఎంతో మంచిది. ఇప్పుడు మీకు ఎటువంటి ఆకులతో చేసిన విస్తరాకులలో తింటే ఎటువంటి ఫలితాలు వస్తాయో వివరిస్తాను.
 
 అరటి ఆకు  -
ఇందు భుజించటం మిక్కిలి శ్రేష్టం. కఫవాతములను హరించును. బలమును, ఆరోగ్యమును పెంచును. శరీరకాంతిని , సంభోగ శక్తిని పెంచును.  ఆకలిని , దంతకాంతిని కలిగించును. పైత్యశాంతిని కలుగచేయును. శ్లేష్మ సంబంధ దోషాలు పోవును. శరీరం నొప్పులు తగ్గించును. ఉదరము నందలి పుండ్లు అనగా పెప్టిక్ అల్సర్ ను నయం చేయును.
 
 మోదుగ విస్తరి  -
ఇందులో భుజించుటచే గుల్మరోగం, మహోదరం, క్రిమిరోగం, రక్తసంబంధ రోగాలు, పిత్తరోగములు నశించును. బుద్దిని పెంచును.
 
మర్రి ఆకు విస్తరి  -
దీని యందు భుజించిన క్రిమి రోగ నివారణ, జఠరాగ్ని వృద్ది, కుష్ఠు వ్యాధి నివారణ అగును. నేత్రదోష నివారణ అగును. వీర్యవృద్ధి కలుగును.
 
పనస  -
దీని విస్తరి యందు భుజించిన అగ్నివృద్ధి , పిత్తహర గుణములు ఉండును.
 
రావి  -
ఇది పిత్తశ్లేష్మ నివారణ , అగ్నివృద్ది కలిగించును. వీర్యవృద్ధి కలుగచేయును . విద్యార్జనకు మనసు కలుగచేయును .
 
వక్క వట్ట  -
ఇది అగ్నివృద్ధిని కలుగచేయును . వాత,పిత్త రోగాలని హరించును . 
 
పైన చెప్పిన ఆకులలో భోజనం చేయడం వలన ఆయా ఆకులలో ఉండు ఔషధ గుణాలు అన్నియు మన శరీరం నందు చేరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చును. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇస్నోఫీలియా తగ్గాలంటే పసుపు వేసుకుని అలా చేస్తే...