Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇస్నోఫీలియా తగ్గాలంటే పసుపు వేసుకుని అలా చేస్తే...

ఇస్నోఫీలియా తగ్గాలంటే పసుపు వేసుకుని అలా చేస్తే...
, మంగళవారం, 9 నవంబరు 2021 (23:19 IST)
పూర్వకాలం నుండి ప్రతి ఇంటి గడపలకు పసుపు రాయడం ఆచారం. తద్వారా క్రిములు, కీటకాలు లాంటివి ఇంటిలోకి ప్రవేశించవనే అభిప్రాయం ఆ ఆచారం వెనుక దాగి ఉన్న వైజ్ఞానిక సత్యం. ఇంటిలోను, బావులు మొదలగు తేమ ప్రాంతాల్లో పని చేసే స్త్రీల పాదాలకు క్రిములు సంక్రమించకుండా పసుపు రాసుకునేవారు. మరలా మన పూర్వ సంప్రాదాయాలను గుర్తుతెచ్చుకునే పరిస్థుతులు ఏర్పడ్డాయి. కరోనా వైరస్ నుంచి కూడ పసుపు మనకు రక్షణ కల్పిస్తుంది.
 
వేపాకు, పసుపు నీటిలో కలిపి బాగా మరగనివ్వాలి. ఆ నీటిని ఇంటి చుట్టు చల్లకోవాలి. మనం ఎక్కువగా శానిటైజర్లు వాడవలసి పరిస్తుతులు. ఇవి పడని వారికి అరిచేతులు మంటలు వస్తాయి. అలాంటి వారు ఈ నీటిని ఉపయోగించుకోవాలి.
 
గ్లాసు వేడి పాలల్లో అరచెంచా పసుపుపొడి, కొంచెం మిరియాల పొడి కలిపి ఆ మిశ్రమాన్ని వేడి చేసి ప్రతిరోజు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తాగడం వల్ల జలుబు, తుమ్మలు దగ్గు లాంటివి నివారింపబడతాయి. 
 
పసుపు, ఉసిరిక చూర్ణం ఈ రెండింటిని రెండు గ్రాముల చొప్పున తీసుకుని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సేవిస్తే మధుమేహం అదుపులో ఉంటుంది. 
 
ఇస్నోఫీలియా వ్యాధిలో పసుపు గుణం అపారం. అరచెంచా పసుపులో మూడు చెంచాల స్వచ్చమైన తేనె వేసి రోజుకి మూడు సార్లు చొప్పున నాలుగు నెలల పాటు తీసుకుంటే ఆ వ్యాధి తగ్గు ముఖం పడుతుంది.
 
ముక్కలుగా కొట్టిన పసుపుకొమ్ములు, గోధుమలు సమంగా తీసుకుని దోరగా వేయించి దంచిన చూర్ణాన్ని జల్లించి ఉంచుకుని, రోజూ మూడుపూటలా ఆహారానికి ఆరగంట ముందు పావుస్పూను పొడిని అరగ్లాసు గోరువెచ్చటి నీటిలో కలిపి తాగడం వల్ల ఉబ్బసం వ్యాధి నియంత్రణలో ఉంటుంది. వ్యాధి తీవ్రత తగ్గుతుంది. అంతేకాకుండా తుమ్ములు, జలుబు తగ్గుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌ నగరంలో ప్రారంభమైన మహదీయ మేకప్‌ స్టూడియో