Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కంద గడ్డ తింటున్నారా? ఐతే ఇవి చూడండి

కంద గడ్డ తింటున్నారా? ఐతే ఇవి చూడండి
, సోమవారం, 13 నవంబరు 2023 (20:40 IST)
కంద. ఈ కంద దుంపలో ఉండే పొటాషియం, ఫైబర్, సహజమైన చక్కెర మనకు చాలా తక్కువ క్యాలరీస్‌తోనే ఎక్కువ బలం లభించేలా చేస్తాయి. కంద దుంప వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు, ఇబ్బందులు తెలుసుకుందాము. చిన్న కంద దుంప ద్వారా దాదాపు మన శరీరానికి 6 గ్రాముల ఫైబర్ చేరుతుంది. కందను తినడం వల్ల ఒబెసిటి, షుగర్ వ్యాధి బారిన పడకుండా కాపాడుతుంది.
 
కంద ప్రొస్టేట్ క్యాన్సర్ నివారణకు ఔషధంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పైల్స్‌తో బాధపడేవారు కందని ఆహారంలో చేర్చుకుంటే ఆ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. లేత కంద కాడలని శుభ్రంగా కడిగి పులుసుగా చేసుకొని తింటే డయేరియా తగ్గుతుంది.
 
కంద తీసుకుంటుంటే ఆకలిని పెంచుతుంది. చిన్నపిల్లలు, గర్భిణీలు లేదా తల్లిపాలు ఇస్తున్న మహిళలు, ప్రోటీన్ ఎస్ లోపం ఉన్న వ్యక్తులు కందను తినరాదు. గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్యుని సలహా తప్పనిసరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుదీనా రసం ఆరోగ్య ప్రయోజనాలు