మైసూర్ బోండా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది బాగా డీప్ ఫ్రై చేసిన ఫుడ్. ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఇంతకీ మైసూర్ బోండాలో ఏమేమి వాడుతారో చూద్దాం.
పెరుగు, మైదాపిండి, బియ్యంపిండి. ఈ మూడింటిని కలిపి చేసేదే మైసూర్ బోండా. మైదా కలిపిన ఏ పదార్థమైనా అది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ముఖ్యంగా వీటిని మధుమేహం వున్నవారు, గుండె జబ్బులతో బాధపడే వారు మైసూర్ బోండాలకు దూరంగా వుండాలి.
బియ్యంపిండిలో హైకార్బోహైడ్రెట్స్ వుంటాయి. దీన్ని మైదా పిండితో కలిపి తింటే గుండె జబ్బులతో బాధపడేవారికి సమస్యను కలిగిస్తుంది. అలాగే ఏదైనా డీప్ ఫ్రై చేసి తయారు చేసే పదార్థం ఆరోగ్యానికి మంచిది కాదు. మైసూర్ బోండాను డీప్ ఫ్రై చేసి తయారుచేస్తారు. కనుక వీటికి దూరంగా వుండటం ఆరోగ్యానికి ఎంతో మంచిది.