Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 4 April 2025
webdunia

కాఫీ తాగితే స్లిమ్‌గా మారుతారా?

Advertiesment
coffee make you slim
, గురువారం, 10 మార్చి 2022 (23:41 IST)
కాఫీ తాగితే సన్నబడతారా? కెఫిన్ స్లిమ్ చేయడంలో సహాయం చేయదంటున్నారు నిపుణులు. ఇది బరువు తగ్గించే ప్రయత్నాలను కొద్దిగా పెంచవచ్చు లేదా బరువు పెరుగటాన్ని నిరోధించడంలో సహాయపడవచ్చు. అయితే కెఫీన్ వినియోగం బరువు తగ్గడానికి దారితీస్తుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

 
కప్పు కాఫీ తాగడం వల్ల అలసిపోయినట్లు అనిపిస్తే అందులో వుండే కెఫీన్ ప్రభావాలు కారణం కావచ్చు. నిద్ర-మేల్కొనే చక్రాన్ని నియంత్రించే మెదడులోని కొన్ని రసాయన ప్రక్రియలు జరగడం ద్వారా కెఫీన్ చురుకుదనాన్ని పెంచుతుంది. అయినప్పటికీ, శరీరం కెఫిన్‌ను పూర్తిగా జీవక్రియ చేసిన తర్వాత అది మనిషిని అలసిపోయేలా చేస్తుంది.

 
కెఫిన్ కొందరిలో నిద్రకు అంతరాయాన్ని కలిగిస్తుంది. అందుకే కాఫీ తాగాలనుకునేవారు పడుకునే ముందు కనీసం 6 గంటల ముందు తాగాలి. ఎందుకంటే కాఫీ తాగిన తర్వాత 5 గంటల వరకు దాని ప్రభావం శరీరంపై వుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పసుపు, కరివేపాకు మెత్తగా రుబ్బి అలా పూసుకుంటే...