Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్లాస్టిక్ వస్తువుల్లో వేడి వేడి ఆహార పదార్థాలు తీసుకుంటే?

ప్లాస్టిక్ వస్తువుల్లో వేడి వేడి ఆహార పదార్థాలు తీసుకుంటే?
, మంగళవారం, 29 మార్చి 2022 (19:32 IST)
Food in plastic
ప్లాస్టిక్ కప్పుల్లో వేడి వేడి ఆహార పదార్థాలను తీసుకోవడం హానికరమని, ఎక్కువగా ప్లాస్టిక్‌ పాత్రలో తినడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని తాజా అధ్యయనం తేల్చింది. అలాగే గర్భిణీ స్త్రీలు ప్లాస్టిక్‌ పాత్రలలో ఆహారం తినడం వల్ల పుట్టబోయే పిల్లలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. 
 
మైక్రోవేవ్‌లో ప్లాస్టిక్‌ పాత్రలలో ఆహారాన్ని వేడి చేయడం కూడా హానికరమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ మైక్రోవేవ్‌ ఉపయోగించాల్సి వస్తే ప్లాస్టిక్‌కు బదులుగా పేపర్‌ టవల్‌, గ్లాస్‌ ప్లేట్‌ లేదా సిరామిక్‌ వస్తువులను ఉపయోగించడం మంచిది. 
 
చల్లటి నీరు, పదార్థాలకు మంచిదే కానీ.. వేడి పదార్థాలను తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం. వేడి పదార్థాలను ప్లాస్టిక్‌లో లేదా డిస్పోజబుల్‌ ప్లేట్లలో ఉంచడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని పరిశోధకులు అంటున్నారు. 
 
ప్లాస్టిక్ తయారు చేసేందుకు బిఎస్‌ ఫినాల్‌ను ఉపయోగిస్తారు. ఇది విషపూరితమైనది. దీని వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్‌, ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ పొంచివుండే ప్రమాదం ఉంది. 
 
బీపీఏ అనేది మానవ శరీరంలోని ఈస్ట్రోజెన్‌ వంటి హార్మోన్లను అసమతుల్యత చేసే రసాయనమని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
 
దీని వల్ల మానసిక ఒత్తిడి మొదలైన వాటికి దారి తీస్తుంది. అలాగే అలెర్జీలు, గుండెకు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్‌ తీవ్రతను పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రక్తంలో చక్కెర నియంత్రణ కోసం...