చాలామంది క్యాప్సికంను పట్టించుకోరు. అయితే డయాబెటిన్ కలిగిన వారు ప్రతిరోజు కనుక దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు.
ముఖ్యంగా క్యాప్సికంలో ఉండే అల్ఫాగ్లూకోజైడేజ్, లైపేజ్ అనే ఎంజైమ్‌లు కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారే ప్రక్రియను నెమ్మదింపజేస్తాయట. అలాగే దీనివల్ల కార్బోహైడ్రేట్లు తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా చేస్తాయట.
అంతేకాకుండా క్యాప్సికంలోని యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయట. మానసిక ప్రశాంతతను అందిస్తాయట. క్యాప్సికమ్‌కు శరీరంలోని క్రొవ్వును కరిగించే గుణం ఎక్కువగా ఉందంటున్నారు వైద్య నిపుణులు. మరెందుకు ఆలస్యం క్యాప్సికం అంటే ఇష్టంలేని వారు కూడా దీన్ని తినడం మొదలుపెట్టండి.