మనిషి లావవడానికి నిద్రకు సంబంధం వుందా?

గురువారం, 2 జనవరి 2020 (23:11 IST)
జీవనశైలి సక్రమంగా లేకపోతే వచ్చే అనారోగ్య సమస్యలు గురించి వేరే చెప్పక్కర్లేదు. ఎన్నో సమస్యలు వస్తాయి. రోజుకు 8 గంటల పాటు నిద్రలేకపోతే ఆ ప్రభావం ఆకలిపై పడుతుందని వైద్యులు అంటున్నారు. 8 గంటలు కాకుండా రోజుకు ఆరు గంటలు నిద్రపోయే వారిలో ఆకలి ప్రభావం అధికంగా ఉంటుంది. తద్వారా విపరీతమైన ఆహారం తీసుకోవాలనిపిస్తుంది. 
 
అన్నం తినాలనిపించదు. జంక్ ఫుడ్ ఎక్కువగా తినాలనిస్తుంది. ఈ జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఒబిసిటీ తప్పదని వైద్యులు సూచిస్తున్నారు. లేటు నైటు నిద్రతో ఒబిసిటీతో పాటు గుండెపోటు, డయాబెటిక్ వంటి సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
ఆధునిక పోకడల కారణంగా సిటీ లైఫ్‌కు అలవాటు పడి.. అర్థరాత్రులు మేలుకుంటూ ఆఫీసుల్లో సిస్టమ్‌లు చూసింది చాలక రాత్రిపూట కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు, సిటీ కల్చర్, ట్రెండ్ పేరు చెప్పుకుంటూ నిద్రను చెడగొట్టుకునే వారి సంఖ్య కూడా అమాంతంగా పెరుగుతోంది. లేట్ నైట్ పబ్‌లతో, ఫేస్ బుక్ చాటింగ్‌లతో నైట్ మొత్తం నిద్రపోకుండా గడిపేస్తున్నారు. నిద్రను కష్టం మేర ఆపుకుంటున్నారు. ఈ పద్ధతే ఆరోగ్యానికి కీడు చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మునగాకుతో థైరాయిడ్ పరార్.. కాలేయానికి దివ్యౌషధం