Publish Date: Wed, 19 Dec 2018 (18:16 IST)
Updated Date: Wed, 19 Dec 2018 (19:00 IST)
ఉంగరాలు సాధారణంగా చేతి వేళ్ళకు పెట్టుకుంటారు. ఉంగరం స్త్రీలే కాదు పురుషులు కూడా ధరిస్తుంటారు. చాలా వరకు రాశులు, నక్షత్రాలను అనుసరించి కొన్ని రకాల ఉంగరాలను చేతికి వేసుకుంటారు. ఉంగరాలలో చాలా రకాలున్నాయి. అవి బంగారం, వెండి, రాగి ఉంగరాలు. వీటిలో రాగి ఉంగరం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆ ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. రాగి ఉంగరం వేసుకోవడం వల్ల రక్తపోటు, గుండెపోటు రాకుండా కాపాడుతుంది.
2. రాగి ఉంగరం వేసుకోవడం వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది.
3. రాగి ఉంగరం ధరించడం వల్ల సూర్యని నుండి పాజిటివ్ శక్తిని పొంది.. చెడును తొలగిస్తుంది.
4. పనిలో ఒత్తిడిగా ఉన్నప్పుడు రాగి ఉంగరం వేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతుంది.
5. రాగి శరీరాన్ని కూల్‌గా ఉంచుతుంది. రక్తపోటుని అదుపులో ఉంచుతుంది.
6. తరచూ తలనొప్పితో బాధపడే వారికి రాగి ఉంగరం ధరిస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
7. రాగి ఉంగరం శరీరంలో ఆరోగ్యపరంగా.. అన్ని రకాలుగా ఆరోగ్యం ఉండటానికి సహాయపడుతుంది.
webdunia
Publish Date: Wed, 19 Dec 2018 (18:16 IST)
Updated Date: Wed, 19 Dec 2018 (19:00 IST)