Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బంగాళాదుంప రసాన్ని తీసుకుంటే..?

బంగాళాదుంప రసాన్ని తీసుకుంటే..?
, బుధవారం, 19 డిశెంబరు 2018 (10:52 IST)
బంగాళాదుంపలు వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బంగాళాదుంప శరీర నొప్పులను తగ్గిస్తుంది. దీనిలోని న్యూట్రిషియన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి కావలసిన ఎనర్జీ, పోషకాలను అందిస్తాయి. బంగాళాదుంపతో తయారుచేసిన పదార్థాలు తీసుకుంటే చర్మం అందానికి కూడా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
1. బంగాళాదుంపను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని బాగా శుభ్రం చేసుకుని కాసేపు ఫాన్ కింద ఆరనివ్వాలి. ఆ తరువాత ఈ ముక్కలను ఓ బౌల్‌లో తీసుకుని వాటిల్లో కొద్దిగా ఉప్పు, కారం, చిటికెడు పసుపు వేసి బాగు కలుపుకోవాలి. ఇలా చేసిన మిశ్రమాన్ని వేడివేడి నూనెలో వేయించుకుని సేవిస్తే చాలా రుచిగా ఉంటాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. 
 
2. బంగాళాదుంపలను కట్ చేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌లో కొద్దిగా ఉప్పు, తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. దాంతో కంటి నిండా నిద్రపోవచ్చు.
 
3. బంగాళాదుంపలను ఉడికించుకుని వాటిలో కొద్దిగా పసుకోవాలి. ఆపై నూనెలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉప్పు, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. తరువాత బంగాళాదుంపలు వేసి కలుపుతూ ఓ 5 నుండి 10 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని చపాతీ, పూరీల్లో వేసి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ మిశ్రమం అనారోగ్య సమస్యల నుండి కాపాడుతుంది. 
 
4. వేయించుకున్న బంగాళాదుంపలలో కొన్ని టమోటాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇందులో అన్నం కలిపి పిల్లలకు తినిపిస్తే ఎంతో ఇష్టంగా తింటారు. వారి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
 
5. బంగాళాదుంప పేస్ట్‌ను ముఖానికి రాసుకుంటే కంటి కిందటి నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి. దాంతో ముఖం తాజాగా, కాంతివంతంగా తయారవుతుంది.   

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీలకర్ర గ్లాసు నీటిలో మరిగించి వడకట్టి తీసుకుంటే...