Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రయాణాలలో వాంతులా.. అయితే ఇలా చేయండి..?

Advertiesment
ప్రయాణాలలో వాంతులా.. అయితే ఇలా చేయండి..?
, మంగళవారం, 18 డిశెంబరు 2018 (14:16 IST)
చాలామందికి బస్సు, ఆటో, రైళ్లు వంటి వాహనాల్లో ప్రయాణాలు చేస్తే వాంతులొస్తుంటాయి. దాంతో తలనొప్పి, నీరసం, శరీరమంతా నొప్పిగా ఉంటుంది. ఇలా వాంతులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం...
 
1. వాహనాల్లో చివరి సీట్లో కూర్చోరాదు. కొందరు సాధారణంగా ప్రయాణాలు చేసేటప్పుడు కిటికీ పక్క సీటును ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే.. ఇతర వాహనాలు ఎలా వెళ్తున్నాయో చూడడానికి.. అలా చూశాక ప్రయాణంలో పుస్తకాలు చదవరాదు. ఒకవేళ అలా చేస్తే కంటి చూపు అంతగా కనిపించదు. దాంతో ఒకరకమైన ఫీలింగ్ కలుగుతుంది. అది వాంతులు వచ్చేలా చేస్తుంది. 
 
2. చాలామంది ప్రయాణాలు చేసేటప్పుడు మద్యం సేవిడం, పొగ తాగడం వంటివి చేస్తుంటారు. ఇలా చేస్తే.. వాంతి సమస్యను మనమే కొని తెచ్చుకున్నట్టవుతుంది. అలానే ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలను కూడా తినరాదు.
 
3. ఎక్కడికైనా ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు దానికి ముందుగా భోజనం చేయరాదు. ఒకవేళ తినాల్సి వస్తే కొద్దిగా తీసుకోవాలి. ఎక్కువగా తింటే.. ప్రయాణంలో వాంతులు వచ్చేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. 
 
4. ప్రయాణంలో వాంతులు రాకుండా ఉండాలంటే.. పుదీనా ఆకులను నమిలినా, పుదీనా టీ తాగినా సమస్య తగ్గుముఖం పడుతుంది.
 
5. వాహనాల నుంచి వచ్చే పెట్రోల్, డీజిల్ వాసన, ఇతర వ్యక్తుల చెమట వాసన కలిపి ఒక్కోసారి వాంతులు వస్తాయి. అలాంటప్పుడు సువాసన వెదజల్లే పువ్వులను వాసన పీల్చుకుంటే ఫలితం ఉంటుంది. 
 
6. వీటన్నింటికంటే.. చాలా ఉపయోగపడేది. నిమ్మకాయ... మీరు ప్రయాణం చేసేటప్పుడు ఒక్క నిమ్మకాయను మాత్రం దగ్గర ఉంచుకోండి.. వాంతి వచ్చేటట్టుగా ఉంటే.. ఆ నిమ్మకాయ వాసనను పీల్చుకోండి. లేదా దాని రసాన్ని తాగండి.. ఇలా చేయడం వలన కూడా ప్రయాణంలో వాంతులు రాకుండా చూసుకోవచ్చును. 
 
7. చాలామందికి తాను ప్రయాణం చేస్తే వాంతి వస్తుందనే భావన గలవారు.. ప్రయాణానికి ముందుగా అల్లం రసాన్ని తీసుకోండి.. లేదా మార్గమధ్యలో ఉన్నా అల్లం టీ తాగాలి. ఇలా చేస్తే వాంతులు రాకుండా ఆపవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉల్లిపాయను నూనెలో వేయించి తీసుకుంటే..?