Publish Date: Sat, 02 Feb 2019 (15:58 IST)
Updated Date: Sat, 02 Feb 2019 (16:00 IST)
సాధారణంగా జలుబు చేస్తే ఆహారం రుచి, వాసన తెలియదు. ఇలా ఎందుకు జరుగుతుందన్న విషయం చాలా మందికి తెలియదు. నిజానికి జలుబు చేసేది ముక్కుకు. దీనివలన ముక్కు దిబ్బడవేసి శ్వాస పీల్చుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అయితే జలుబు చేసినప్పుడు అన్నం, వంటకాల రుచి తెలిసే అవకాశం దాదాపుగా ఉండదు.
ముక్కుకు ఇబ్బంది చేస్తే.. నాలుక ఎందుకు పని చేయదనే సందేహం ప్రతీ ఒక్కరిలో కలిగేదే. రుచి చివరగా నాలుకతో చూసినా ముందుగా రుచిని తెలియజెప్పేది ముక్కు. వంటకాలు తయారు చేస్తున్నప్పుడు వచ్చే సువాసనలు పీల్చగానే నోరూరుతుంది. కాబట్టి ముందుగా ముక్కు వాసన గుర్తిస్తేనే నాలుక రుచిని బాగా తెలుసుకుంటుంది. అందువలనే జలుబు వలన ముక్కు పడకవేస్తే నాలుక రుచిని తెలుసునే శక్తిని కోల్పోతుంది.