Publish Date: Thu, 20 Dec 2018 (14:32 IST)
Updated Date: Thu, 20 Dec 2018 (15:09 IST)
నేటి తరుణంలో వ్యాయమాలు, యోగాసనాలు, ధ్యానాలు చేసేవారు చాలా తక్కువగా ఉన్నారు. వీటిని చేయకపోతే ఊబకాయంతో బాధపడాల్సివస్తుందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఊబకాయం కారణంగా బరువు విపరీతంగా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. మరి ధ్యానాలు, యోగాలు చేస్తే బరువు తగ్గుతారో లేదో తెలుసుకుందాం...
ఇటీవలే ఓ యూనివర్సిటీలో చేసిన పరిశోధనలో మైండ్ రిలీఫ్ చేసే.. ధ్యానాలు, యోగాలు చేస్తే బరువు తప్పకుండా తగ్గుతారని తేల్చి చెప్పారు. రోజూ ఉదయాన్నే నిద్రలేవగానే సూర్యుని ముందు కూర్చిని ఓ 10 నుండి 15 నిమిషాల పాటు ధ్యానం చేస్తే.. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. ఆ రోజంతా ఏదో సాధించినట్టుగా అనిపిస్తుంది. వాకింగ్ చేస్తే, తిండి తగ్గిస్తే బరువు తగ్గవచ్చని కొందరు ఆలోచిస్తుంటారు.. కానీ, అది నిజం కాదని స్పష్టం చేశారు వైద్యులు.
బరువు తగ్గాలని తిండి తగ్గిస్తే.. శరీరం నీరసానికి లోనవుతుంది. దాంతో ఊబకాయం, శరీరంలో అధిక కొవ్వు ఏర్పడి అనారోగ్య సమస్యలు దారితీస్తుంది. కనుక ఎట్టిపరిస్థితుల్లో తిండిని మాత్రం ఎప్పుడూ మానేయకండి. మైండ్ రిలీఫ్‌తో ప్రతిరోజూ ధ్యానం చేసినవారు.. ఇతరులతో పోలిస్తే ఆరు నెలల కాలంలో అధిక బరువు తగ్గారని పరిశోధకులు గుర్తించారు.
వెయిట్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లో పాల్గొంటున్న 53 మందిలో మైండ్ రిలీఫ్ ధ్యానంతో నాలుగు దశల్లో మూడింటిని పూర్తిచేసిన 33 మంది అధిక బరువును కోల్పోయి స్లిమ్‌గా మారారని అధ్యయనంలో వెల్లడైంది.
webdunia
Publish Date: Thu, 20 Dec 2018 (14:32 IST)
Updated Date: Thu, 20 Dec 2018 (15:09 IST)