Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొవ్వును కరిగించే.. ఆహార పదార్థాలివే..?

కొవ్వును కరిగించే.. ఆహార పదార్థాలివే..?
, గురువారం, 3 జనవరి 2019 (11:14 IST)
నేటి తరుణంలో కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్‌లు అంద‌రినీ వేధించే స‌మ‌స్యలుగా ఉన్నాయి. దీనికి కార‌ణం స‌రైన ఆహార నియ‌మాలు పాటించ‌క‌పోవ‌డం, రెగ్యుల‌ర్‌గా వ్యాయామం చేయ‌క‌పోవ‌డం వ‌లన బ‌రువు పెరిగిపోతున్నారు. ఒక్క‌సారి బ‌రువు పెరిగిన త‌రువాత త‌గ్గ‌డం చాలా క‌ష్ట‌మైన‌ప‌ని.

కొన్ని సంద‌ర్భాల్లో కొంత‌మంది ఎన్ని విధాలుగా ప్ర‌య‌త్నించినా.. బ‌రువు త‌గ్గ‌క‌పోవ‌డంతో చాలా ఇబ్బందులు ప‌డుతుంటారు. అయితే శ‌రీరంలో కొవ్వు పేరుకుపోవ‌డానికి కార‌ణ‌మ‌య్యే ఆహార‌ప‌దార్థాల గురించి తెలుసుకుంటే.. బ‌రువు పెర‌గ‌కుండా.. కొలెస్ట్రాల్‌కి దూరంగా ఉండ‌వ‌చ్చు.
 
1. పండ్లు యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, సిట్రస్ వంటి పండ్లు రెగ్యుల‌ర్‌గా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొవ్వు ప‌దార్థాల స్థాయిలు త‌గ్గుతాయి. అలాగే ఆహారం సులువుగా జీర్ణ‌మ‌వుతుంది.
 
2. ఓట్స్ కొవ్వును తగ్గించడంలో చాలా శక్తివంతంగా పని చేస్తుంది. దీని ద్వారా రోజుకి 25 నుంచి 35 గ్రాముల ఫైబర్ పొంద‌వ‌చ్చు. కాబ‌ట్టి  ఓట్స్‌ను రెగ్యుల‌ర్‌గా తీసుకోవ‌డం వ‌లన అధిక బ‌రువుకి చెక్ పెట్ట‌వ‌చ్చు.
 
3. అవ‌కాడోలో గుండె ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్ కలిగి ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌లన శరీరంలో మంచి కొవ్వు పదార్థాలను పెంచి, చెడు కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి.
 
4. గ్రెయిన్స్ బార్లీ, ఓట్స్ వంటి ఓల్ గ్రైన్స్‌ గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడ‌తాయి. గ్రైన్స్ వల్ల‌ శరీరంలో చెడు కొవ్వు పదార్థాలు త‌గ్గుతాయి. దీని వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని త‌గ్గాంచుకోవ‌చ్చు.
 
5. బీన్స్‌లో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. ర‌క‌ర‌కాల రూపాల్లో ల‌భించే బీన్స్ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర బ‌రువు త‌గ్గించుకోవచ్చు. కొవ్వు ప‌దార్థాల‌ను క‌రిగించుకోవ‌చ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందాన్ని పెంచే 5 ఆకులు... ఏంటవి?