గుగ్గిళ్ళు అనేవి వివిధ రకాల ధాన్యాలతో, పప్పులతో చేసే ఆరోగ్యకరమైన, రుచికరమైన చిరుతిండి. గుగ్గిళ్ళను తయారుచేసేందుకు ఎక్కువగా శనగలు, ఉలవలు, పెసలు, అలసందలు వంటి వాటిని ఉపయోగిస్తారు. వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఒక్కొక్క ధాన్యానికి ఒక్కో విధంగా ఉంటాయి. సాధారణంగా గుగ్గిళ్ళలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
గుగ్గిళ్ళలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీర కణజాలాల నిర్మాణం, మరమ్మత్తుకు అవసరం.
వీటిలో ఫైబర్ ఎక్కువ కనుక ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకాన్ని నివారిస్తుంది.
గుగ్గిళ్ళను తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
గుగ్గిళ్ళలో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి రక్తపోటును నియంత్రించి, తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
గుగ్గిళ్ళలో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
గుగ్గిళ్ళను స్నాక్స్‌గా తీసుకోవడం వల్ల మంచి పోషకాలు లభిస్తాయి. ఏ ఆహారాన్నైనా మితంగా తీసుకోవడం ముఖ్యం.