Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

Advertiesment
Almonds

సిహెచ్

, గురువారం, 7 ఆగస్టు 2025 (23:39 IST)
పండుగ సీజన్ ప్రారంభాన్ని రక్షా బంధన్ సూచిస్తుంది. తోబుట్టువుల మధ్య బంధాన్ని ఇది వేడుక చేస్తోంది. ఈ సంవత్సరం, మీ తోబుట్టువుల దీర్ఘకాలిక విజయం, శ్రేయస్సు కోసం ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా మార్చటం ద్వారా ఆ హృదయపూర్వక వాగ్దానాన్ని ఆలోచనాత్మక సంజ్ఞతో గౌరవించండి. పండుగలు తరచుగా ఆనందకరమైన భోజనం, తీపి వంటకాలతో వస్తాయి. కానీ, ఆ ఆనందాన్ని బుద్ధిపూర్వక ఎంపికలతో సమతుల్యం చేసుకోవడం ముఖ్యం. ఈ రక్షా బంధన్ వేళ, కాలిఫోర్నియా బాదం వంటి పోషకమైన ఆహారాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా వేడుకలను మరింత అర్థవంతంగా మార్చుకోండి.
 
ముఖ్యమైన పోషకాల గని, బాదం. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడటం నుండి ఎల్‌డిఎల్, టోటల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడం వరకు తోడ్పాటును అందించటంతో పాటుగా, మెరుగైన గుండె ఆరోగ్యానికి, మొత్తం శ్రేయస్సుకు దోహదం చేస్తుంది. మీ వేడుకలకు కాలిఫోర్నియా బాదంపప్పులను జోడించడం వంటి చిన్న మార్పులు చేయడం ద్వారా, మీరు, మీ కుటుంబ ఆరోగ్యం పెంపొందించుకోవచ్చు.
 
తాను రక్షా బంధన్‌ను ఎలా జరుపుకుంటానో బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ వెల్లడిస్తూ, రక్షా బంధన్ నా కుటుంబానికి ఒక ప్రత్యేకమైన రోజు. నేను గ్రిల్డ్ బాదం బర్ఫీ, బాదంపప్పు బ్రౌనీలు వంటి ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాలను తయారు చేస్తాను. బాదం రుచి కరమైనవి మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి ప్రయోజనకరమైనవి అని అన్నారు. 
 
మాక్స్ హెల్త్‌కేర్- ఢిల్లీ రీజినల్ హెడ్-డైటెటిక్స్, రితికా సమద్దర్ మాట్లాడుతూ, రక్షా బంధన్ వంటి పండుగల సమయంలో, ప్రజలు తరచుగా అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటుంటారు. దాని ప్రభావం ఆరోగ్యం, బరువుపై ఉందని గ్రహించరు. బాదం వంటి పోషకాలతో కూడిన ఆహార ఎంపికలు, అనారోగ్యమైన ఆహారానికి ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. భారతీయుల కోసం ఇటీవల ఐసిఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు మొక్కల ప్రోటీన్ మరియు దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని అందించే రోజువారీ, ఆరోగ్యకరమైన ఎంపికగా బాదంపప్పును వెల్లడించాయి. క్రమం తప్పకుండా బాదం తీసుకోవటం మొత్తం కుటుంబం యొక్క ఆరోగ్యం, శ్రేయస్సుకు కూడా తోడ్పడుతుంది అని అన్నారు. 
 
న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్, షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ, రక్షా బంధన్ సమయంలో తీపి పదార్థాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. కానీ రక్తంలో చక్కెర మరియు మొత్తం ఆరోగ్యంపై వాటి ప్రభావాన్ని తరచుగా విస్మరిస్తుంటారు. పండుగ సమయంలో బాదం మరియు తాజా పండ్లు వంటి ఆరోగ్యకరమైన ఎంపికలను చేసుకోవాలని నేను సిఫార్సు చేస్తున్నాను అని అన్నారు. ఈ రక్షా బంధన్‌ను దీర్ఘకాలిక ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే బుద్ధిపూర్వక ఆహార ఎంపికలతో వేడుక జరుపుకుందాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు