మొలకెత్తిన పెసళ్లు తింటే.. వయసు మీద పడదట

శనివారం, 29 ఫిబ్రవరి 2020 (17:09 IST)
నిత్యయవ్వనులుగా కనిపించాలంటే.. వయసు దాచాలని కోరుకునేవారు పెసలు తినాలని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. పోషకాలు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటుంటే జీర్ణశక్తి మెరుగవుతుంది. ఒంటికి బలం చేకూరుతుంది.
 
పోషకాలు నిండుగా ఉండే పెసలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని మొలకల్లా చేసి తింటే మరి మంచిది. శరీరభాగాలను సంరక్షించడంలో పెసలు అద్భుతంగా పనిచేస్తాయి. కాపర్ కూడా అధికంగా ఉండే పెసలను తినడం ద్వారా చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. మొలకెత్తిన గింజల్లో సమృద్ధిగా అమైనో ఆమ్లాలు ఉంటాయి. శరీరంలో వ్యాప్తి చెందే క్యాన్సర్ కణాలను ఇవి నిరోధిస్తాయి. 
 
పెసలు పప్పుని ప్రతి రోజు రాత్రి పూట పడుకునే ముందు ఒక్క కప్పులో 50 గ్రాముల మేర నానబెట్టేయాలి. ఉదయాన్నే వాటిలో మొలకలు వచ్చి ఉంటాయి. మాములు పెసలులో కంటే ఇలా మొలకలు వచ్చిన పెసలులో చాలా పోషకాలు ఉంటాయి. వీటిని స్నాక్స్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రెడ్ రైస్ తింటే.. కొలెస్ట్రాల్ మటాష్.. డయాబెటిస్ పరార్