Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 29 April 2025
webdunia

గోధుమలు, జొన్నలు, రాగుల్ని పొట్టు తీయకుండానే?

బీరకాయ, చిక్కుడు, గోరుచిక్కుడు, ములగకాడలు, అరటిదూట, పనసకాయ వంటి పదార్థాలను వంటల్లో చేర్చుకోవడం ద్వారా శరీరానికి కావలసిన ఫైబర్ అందుతుంది. పీచు జీర్ణక్రియకు బాగా దోహదపడుతుంది. పండ్లు, కూరగాయలు, ఆకుకూరల

Advertiesment
Fiber
, శనివారం, 2 డిశెంబరు 2017 (09:07 IST)
బీరకాయ, చిక్కుడు, గోరుచిక్కుడు, ములగకాడలు, అరటిదూట, పనసకాయ వంటి పదార్థాలను వంటల్లో చేర్చుకోవడం ద్వారా శరీరానికి కావలసిన ఫైబర్ అందుతుంది. పీచు జీర్ణక్రియకు బాగా దోహదపడుతుంది.  పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తరిగేటప్పుడు ఎక్కువ కాడలు, తొక్క తొలగించకూడదు. వీటిలోనూ పోషకాలుంటాయి. 
 
గోధుమలు, జొన్నలు, రాగులు.. ఇతర దినుసులను పొట్టును తీయకుండానే పిండి పట్టించుకోవాలి. బియ్యం అతిగా పాలిష్ చేసినవి కాకుండా ఉండాలి. వీలైతే దంపుడు బియ్యం వాడుకోవచ్చు. కంది, పెసర, మినుము, శనగ.. పలు పప్పు ధాన్యాలు యధావిధిగా ఉడకపెట్టుకోవాలి. బీట్‌రూట్, క్యారెట్, పచ్చిబఠాణి, చెరకు, తేగలు తదితర పదార్థాలు తరచూ తినడం మంచిది.
 
వయసు పైబడిన వారిలో జీర్ణక్రియ మందగించడానికి కారణం వీటి లోపమేనని తెలుసుకోవాలి. పీచు పదార్థాలు జీర్ణక్రియలో భాగంగా జీర్ణాశయం నుంచి పెద్ద పేగుల దాకా ఆహారాన్ని తేలికగా, త్వరితంగా చేరుస్తాయి. మాంసాహారంలో కంటే శాకాహారంలో పీచు పదార్థాలు అనేకం. ఆహారంలో పీచు ఎక్కువగా ఉండడంవల్ల త్వరగా జీర్ణమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మానసిక ఒత్తిడి నుంచి వెంటనే ఉపశమనం కోసం ఒక గ్లాస్ ఆ రసం...