Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మానసిక ఒత్తిడి నుంచి వెంటనే ఉపశమనం కోసం ఒక గ్లాస్ ఆ రసం...

పుదీనాలో చాలా ఔషధ గుణాలున్నాయి. పుదీనా ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అందుకే పుదీనాను కాస్మొటిక్ కంపెనీల్లో, కొన్ని వాటిల్లో విరివిగా వాడుతారు. కొన్ని పుదీన ఆకులను గ్లాసు నీళ్ళలో మరిగించి ఆ కాషాయాన్ని తాగితే జ్వరం తగ్గిపోవడమే కాకుం

Advertiesment
మానసిక ఒత్తిడి నుంచి వెంటనే ఉపశమనం కోసం ఒక గ్లాస్ ఆ రసం...
, శుక్రవారం, 1 డిశెంబరు 2017 (22:17 IST)
పుదీనాలో చాలా ఔషధ గుణాలున్నాయి. పుదీనా ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అందుకే పుదీనాను కాస్మొటిక్ కంపెనీల్లో, కొన్ని వాటిల్లో విరివిగా వాడుతారు. కొన్ని పుదీన ఆకులను గ్లాసు నీళ్ళలో మరిగించి ఆ కాషాయాన్ని తాగితే జ్వరం తగ్గిపోవడమే కాకుండా కామెర్ల, కడుపులో మంట, మూత్ర సంబంధింత వ్యాధులు , ఛాతి మంటలు నయం అవుతాయి.
 
నెల తప్పిన స్త్రీలు ఒక చెంచాడు పుదిన రసంలో చెంచాడు నిమ్మరసం, చెంచాడు తేనె కలిపి అప్పుడప్పుడూ తీసుకుని తింటూ ఉంటే వికారం, వాంతులు తగ్గిపోతాయి. పుదిన ఆకు రసాన్ని కంటి కింద నల్ల మచ్చలు ఉన్న ప్రాంతంలో రాస్తూ ఉంటే ఆ నల్లరసం నిదానంగా పోతాయి. మానసిక ఒత్తిడికి, నిద్రలేమి సమస్యకు కొన్ని పుదీనా ఆకులను వేడి నీళ్ళలో వేసి అరగంట సేపు తరువాత తాగితే బాగా ఉపశమనం కలుగుతుంది. ప్రశాంతమైన నిద్ర కూడా వస్తుంది. 
 
నోటి సంబంధిత వ్యాధులకు పుదీన బాగా ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో టెన్షన్ లు ఎక్కువగా కొంత మంది పడుతుంటారు. అలాంటి వారు పుదీన ఆకులను అరచేతిలో బాగా నలిపి ఆ రసాన్ని కణతలకు, నుదిటికి రాసుకుంటే తలనొప్పి తగ్గిపోయి చల్లదనాన్ని ఇస్తుంది. పుదిన ఆకుల్ని ఎండబెట్టి చూర్ణం చేసి అందులో తగినంత ఉప్పు చేర్చి ప్రతిరోజు బ్రష్ చేసుకుంటే చిగుళ్ళు గట్టిబడి దంత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అంతే కాదు నోటి దుర్వాసనను కూడా అరికడుతుంది. 
 
కొంతమందికి శరీరంపై దురద, దద్దుర్లు వస్తాయి. అలాంటి వారు గ్లాసు నీటిలో పుదిన ఆకులను నాన బెట్టి బెల్లాన్ని కలిపి దాంతో పాటు తీసుకుంటే దురద, దద్దర్లు తగ్గుతాయి. చిన్న పిల్లలు కడుపునొప్పితో బాధపడుతుంటే గోర వెచ్చని నీటిలో ఐదు లేక ఆరుచుక్కల పుదిన రసం వేసి తాగించడం వల్ల కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక నిమ్మకాయ, కొద్దిగా నువ్వుల నూనెతో ఆ నొప్పి...