మెంతి ఆకులను నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగితే?

లివర్ సమస్యలను తొలగించడంలో మెంతికూర బాగా పనిచేస్తుంది. లివ‌ర్‌ను ఇది శుభ్రం చేస్తుంది. ఉదర రుగ్మతలను మెంతికూర దూరం చేస్తుంది. డయేరియాకు మెంతికూర చక్కని మందుగా పనిచేస్తుంది. శ్వాసకోశ సమస్యలు మాయమవుతాయి

ఆదివారం, 17 జూన్ 2018 (11:22 IST)
లివర్ సమస్యలను తొలగించడంలో మెంతికూర బాగా పనిచేస్తుంది. లివ‌ర్‌ను ఇది శుభ్రం చేస్తుంది. ఉదర రుగ్మతలను మెంతికూర దూరం చేస్తుంది. డయేరియాకు మెంతికూర చక్కని మందుగా పనిచేస్తుంది. శ్వాసకోశ సమస్యలు మాయమవుతాయి. మెంతికూర ఆకులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. 
 
యాంటీ-డయాబెటిక్ గుణాలను కలిగివుండే మెంతికూర రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. టైప్-2 డయాబెటిస్‌ను నయం చేయడంలో బాగా పనిచేస్తుంది. లివర్ సమస్యలను తొలగించడంలో మెంతికూర భేష్‌గా పనిచేస్తుంది. మెంతి ఆకులను కొంత నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి తాగితే బరువు తగ్గుతారు. మెంతికూరలోని ఔషధ కారకాలు హృద్రోగాలను దూరం చేస్తుంది.
 
ఇంకా చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంలో మెంతికూర బాగా ఉపయోగపడుతుంది. ముఖంపై ఏర్పడే మచ్చలు తొలగిపోతాయి. మెంతి ఆకులను పేస్ట్‌గా చేసి జుట్టు కుదుళ్లకు పట్టించి కొంత సేపటి తరువాత తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యవంతంగా మారుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రాగి పాత్రలోని నీటిని తాగితే మేలెంత..?