Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మారేడు చెట్టును పూజిస్తే.. మారేడు దళాన్ని బీరువాలో వుంచుకుంటే?

శివ పూజలో పువ్వులతో పాటు కొన్ని ఆకులను ఉపయోగిస్తారు. వాటిలో బిల్వపత్రం (మారేడాకు) ప్రధానమైంది. బిల్వ ఆకులతో పూజ శ్రేష్టమైనది. బిల్వపత్రాలు గాలిని, నీటిని శుభ్రపరుస్తాయి. ఈ చెట్టు నుంచి వచ్చే గాలి శరీర

మారేడు చెట్టును పూజిస్తే.. మారేడు దళాన్ని బీరువాలో వుంచుకుంటే?
, శుక్రవారం, 15 జూన్ 2018 (12:29 IST)
శివ పూజలో పువ్వులతో పాటు కొన్ని ఆకులను ఉపయోగిస్తారు. వాటిలో బిల్వపత్రం (మారేడాకు) ప్రధానమైంది. బిల్వ ఆకులతో పూజ శ్రేష్టమైనది. బిల్వపత్రాలు గాలిని, నీటిని శుభ్రపరుస్తాయి. ఈ చెట్టు నుంచి వచ్చే గాలి శరీరానికి సోకడం ద్వారా ఆరోగ్యానికి మేలే జరుగుతుంది. జబ్బులు అంటవు.

అంతర కణాలకు మంచిది. దేహాన్ని శ్రేష్ఠంగా వుంచుతుంది. బిల్వ పత్రాలను నూరి రసం తీసి.. శరీరానికి పూసుకుంటే చెమట వాసన రాదు. మారేడు వేరు రసం తీసి, తేనెతో రంగరించి తాగితే వాంతులు వెంటనే తగ్గుతాయి. ఈ రసాన్ని రోజూ సేవిస్తే అనారోగ్యాలు దరిచేరవు. బిల్వపత్రాలను దంచి కళ్లపై లేపనంగా వేసుకుంటే కంటి దోషాలు ఏమైనా వుంటే నశిస్తాయి. బిల్వ చూర్ణం అతిసారాన్ని తగ్గిస్తుంది.
 
ఇక పవిత్ర వృక్షాల్లో ఒకటి, శివునికి ప్రీతికరమైన ఈ మారేడు ఆకులతో శివపూజ చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మారేడు దళం మూడు భాగాల్లో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శివుడు కొలువుంటారు. మారేడు దళం ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తికి సంకేతం. ఇవి మూడు శివ స్వరూపం.


శివ సహోదరి అయిన మహాలక్ష్మీదేవి హృదయం నుంచి మారేడు దళం ఆవిర్భవించడంతోనే శివునికి ఆ దళం శివునికి ప్రీతికరమైనదని పురాణాలు చెప్తున్నాయి. మారేడు దళం చుట్టూ భక్తితో ప్రదక్షణలు చేసి భక్తితో తాకినట్లైతే శివుడిని స్పర్శించినట్లేనని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. 
 
అంతేగాకుండా రోహిణి నక్షత్రం రోజున మారేడు చెట్టు కింద పూజ చేస్తే దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. సూర్యోదయం నుంచి వచ్చే రోహిణి నక్షత్రం రోజు మారేడు చెట్టుకు పూజ చేస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. రోహిణి నక్షత్రం చంద్రునికి చెందింది. ఇక చంద్రుడిని ఆధిపత్యం వహించే దైవం శ్రీమహాలక్ష్మి. అందుకే రోహిణి నక్షత్రం రోజున మారేడు చెట్టు వద్ద పూజ చేస్తే ఐశ్వర్యం స్థిరంగా నిలబడుతుంది. 
 
మారేడు చెట్టు ఎక్కడున్నా.. లేకుంటే దేవాలయాల్లో వుండే మారేడు చెట్టు వద్దకు వెళ్లి.. హుండీలో 11 రూపాయలు వేసి ఈ పూజ చేయాలి. మారేడు చెట్టు మొదట్లో నీరు పోసి, ఆవు నేతితో దీపారాధన చేసి, గంధపు సువాసన వచ్చే అగరవత్తులను వెలిగించి.. చెట్టు కింద కూర్చుని లక్ష్మీదేవికి సంబంధించి అష్టోత్తరాన్ని పారాయణం చేయాలి. తమలపాకు, పండు, తాంబూలం పెట్టాలి. తమలపాకులు మూడు, రెండు తెలుపు పచ్చిపోకల వక్కలు, రెండు అరటిపండ్లు వుంచి, దక్షిణగా ఐదు రూపాయలు వుంచి.. మారేడు చెట్టు వద్ద పెట్టాలి. 
 
ఆపై తమ దారిద్ర బాధలు తొలగిపోవాలని ఇష్టదైవాన్ని నమస్కరించుకోవాలి. లక్ష్మీదేవికి సంబంధించిన ఏదైనా స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి. తర్వాత చినుగులు లేని మారేడు దళాలను రెండు లేదా మూడు ఇంటికి తెచ్చుకుని.. ఒక దళాన్ని బీరువాలో ఉంచుకోవాలి. రెండోది కవర్లో వుంచి.. ప్యాకెట్లో వుంచుకుంటే డబ్బు స్థిరంగా నిలుస్తుంది. 
 
రోహిణి నక్షత్రం నాడు ఇంటికి తీసుకొచ్చే మారేడు దళాన్ని క్యాష్‌బాక్స్‌లో వుంచుకుంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా మారేడు చెట్టు పూజతో సకల పాపాలు తొలగిపోతాయి. వేదాల ప్రకారం శివుడే ఐశ్వర్య ప్రదాత.. అందుకే మారేడు ఆకులతో ఆయన్ని పూజించి సకల సంపదలను పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆకాశంలో కనిపించని నెలవంక.. రంజాన్ శనివారమే...