రాగి పాత్రలోని నీటిని తాగితే మేలెంత..?
రాగి పాత్రలను వినియోగించడం ద్వారా అనారోగ్యాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. రాగి పాత్రలో కేవలం మూడు గంటల పాటు నీటిని నిల్వ ఉంచితే చాలు. ఆ నీటిలో ఉండే క్రిములు నశిస్తాయి. దీంతో ఆ నీరు పరిశుభ్రంగా మా
Publish Date: Sun, 17 Jun 2018 (11:06 IST)
Updated Date: Sun, 17 Jun 2018 (11:21 IST)
రాగి పాత్రలను వినియోగించడం ద్వారా అనారోగ్యాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. రాగి పాత్రలో కేవలం మూడు గంటల పాటు నీటిని నిల్వ ఉంచితే చాలు. ఆ నీటిలో ఉండే క్రిములు నశిస్తాయి. దీంతో ఆ నీరు పరిశుభ్రంగా మారుతుంది. రాగి పాత్రలలో నీటిని నిల్వ ఉంచడం వల్ల ప్రమాదకరమైన ఈ-కొలి బాక్టీరియా కూడా అంతమవుతుంది. దీని వల్ల అనారోగ్యాలు రాకుండా ఉంటాయి.
రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల అసిడిటీ, అజీర్ణం, డయేరియా, కామెర్లు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అధిక బరువు తగ్గుతారు. గుండె సమస్యలు రావు. క్యాన్సర్ కణాలు నశిస్తాయి. థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరగవుతుంది. రక్తహీనత పోతుంది. హైబీపీ తగ్గుతుంది.
పరగడుపున రాగి చెంబులో నీళ్లు తాగడం వలన పెద్ద పేగు శుభ్రపడి మనం తినే ఆహారంలోని పోషకాలను ఎక్కువ శాతం గ్రహిస్తుంది. కడుపు ఉబ్బరం, కడుపు మంట నివారించబడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
selvi
Publish Date: Sun, 17 Jun 2018 (11:06 IST)
Updated Date: Sun, 17 Jun 2018 (11:21 IST)