Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉపవాసం ఉంటే జ్ఞాపకశక్తి పెరుగుతుందా..?

Advertiesment
ఉపవాసం ఉంటే జ్ఞాపకశక్తి పెరుగుతుందా..?
, శుక్రవారం, 12 అక్టోబరు 2018 (14:13 IST)
దైవం కోసం ఉపవాసాలు చేస్తుంటారు. కొందరైతే కోరిన కోరికలు నెరవేరుతానయే విశ్వాసంతో ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండడం వలన ఆరోగ్యపరంగా బాగుంటారని చాలామంది భావిస్తుంటారు. మరి ఉపవాసం చేయడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
 
ఉపవాసం చేయడం వలన మెదడు పనితీరు పెరగడంతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని పరిశోధలలో వెల్లడైంది. శరీర రోగనిరోధకశక్తిని పెంచుతుందట. ఉపవాసం ఉన్నప్పుడు శరీరంలో కొత్త కణాలు ఏర్పడి పాత కణాలు తొలగిపోతాయి. తద్వారా కణాలు ఉత్తేజాన్ని పొందుతాయి. క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతుంది. 
 
దగ్గు, జలబు వంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఉపవాసం చేయడం వలన వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావు. ఒత్తిడిగా ఉన్నప్పుడు ఏం చేయాలో కూడా తెలియదు. విసుగుగా ఉంటారు. ఆ ఒత్తిడి నుండి ఎలా బయటపడాలో తెలియక బాధపడుతుంటారు. అందువలన వారంలో ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. దాంతో జ్ఞాపకశక్తి మరింత అధికంగా పెరుగుతుంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాగి పాత్రల్లో భోజనం చేస్తే...