అల్పాహారానికి అరగంట ముందు.. బొప్పాయి ముక్కలు తింటే?
అల్పాహారాన్ని లేటుగా తీసుకుంటున్నారా? అయితే పరగడుపున అరకప్పు బొప్పాయి పండ్లు తీసుకోండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. రోజూ పరగడుపున అరకప్పు బొప్పాయి ముక్కల్ని తీసుకుంటే బరువు తగ్గవచ్చు. ఇంకా గుండె ఆరోగ
అల్పాహారాన్ని లేటుగా తీసుకుంటున్నారా? అయితే పరగడుపున అరకప్పు బొప్పాయి పండ్లు తీసుకోండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. రోజూ పరగడుపున అరకప్పు బొప్పాయి ముక్కల్ని తీసుకుంటే బరువు తగ్గవచ్చు. ఇంకా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేయవచ్చునని వారు సూచిస్తున్నారు. అలాగే పండ్లలో యాపిల్‌ను డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పొటాషియం, ఫాస్పరస్ పుష్కలంగా వుండటంతో అనారోగ్య సమస్యలు దరిచేరవు.
ఇంకా ప్రతీరోజూ డైట్‌లో ఏదో ఒక సమయంలో అరటి పండు తీసుకోవాలి. అరటిలోని కెరోతోనిన్ అనే పదార్థం మానసిక వ్యాకులతను దూరంచేస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు. ఇకపోతే.. గుండెను ఆరోగ్యంగా వుంచుకోవాలంటే.. రెడ్ మీట్ కంటే చేపలు తినడం చేయాలి. తద్వారా శరీరానికి ఒమేగా 3 ఫ్యాట్స్ లభిస్తాయి. ఇవి గుండెపోటును అరికడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.