మంచినీళ్లు. కొంతమంది మంచినీళ్లను నిలబడి తాగేస్తుంటారు. ఐతే అలా నిలబడి నీరు తాగితే పలు అనారోగ్య సమస్యలు వస్తాయని చెపుతున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందాము.
నిలబడి నీళ్లు తాగితే ఆ నీరు నేరుగా ఎముకలపై ప్రభావం చూపవచ్చు, ఫలితంగా ఆర్థరైటిస్ సమస్యకు అది కారణం కావచ్చు.నిలబడి నీళ్లు తాగితే ఎసిడిటీ సమస్యను ఎదుర్కోవాల్సి రావచ్చు.
నిలబడి ఉన్న స్థితిలో నీటిని తీసుకోవడం వల్ల కిడ్నీలు కూడా దెబ్బతినే ప్రమాదం వుంటుంది.
దాహం తీరేందుకు నిలబడి నీళ్లు తాగినప్పటికీ తిరిగి మళ్లీ దాహం వేస్తుందని అధ్యయనం చెపుతోంది. నుంచుని మంచినీళ్లు తాగితే అజీర్ణ సమస్యతో బాధపడే అవకాశం వుంది.
నిలబడి నీళ్ళు తాగితే అల్సర్, గుండెల్లో మంట వచ్చే ప్రమాదం వుంది.
కూర్చుని మంచినీళ్లు తాగితే అన్నివిధాలా ఆరోగ్యకరమైనది అని నిపుణులు చెబుతున్నారు.