Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనావైరస్ తగ్గేందుకు టాబ్లెట్లు, ఓవర్ డోస్ వాడితే ఏమవుతుందో తెలుసా?

Advertiesment
covid 19
, బుధవారం, 19 ఆగస్టు 2020 (22:37 IST)
కరోనావైరస్ తెలుగు రాష్ట్రాలలో విజృంభిస్తోంది. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి వాడాల్సి వుంటుంది. ఇది ఒక్కొక్కరిలో ఒక్కోలా వుంటుంది. ప్రస్తుతం కోవిడ్ 19 నయం చేసేందుకు వైద్యులు పలు రకాల మాత్రలు ఇస్తున్నారు. ఈ టాబ్లెట్‌లో కొన్ని పెయిన్ కిల్లర్ మందులు ఉంటాయి. నొప్పి, జ్వరం తగ్గించడానికి ఇవి కలిసి పనిచేస్తాయి. 
 
ఐతే ఈ మాత్రలను ఎంతమేరకు వాడాలన్న మోతాదు, ఎంత తరచుగా అవసరమో డాక్టర్ నిర్ణయిస్తారు. డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి. కోవిడ్ వల్ల తలెత్తే జ్వరాన్ని తగ్గించేందుకు కొన్ని స్వల్పకాలిక ఉపయోగం కోసం మాత్రలు రాస్తారు. వాటిని వాడినా లక్షణాలు కొనసాగుతూ వున్నా లేదా తీవ్రతరం అయితే వైద్యుడిని సంప్రదించాలి.
 
ఈ మాత్రలు వల్ల కొందరిలో సైడ్ ఎఫెక్ట్ కనబడుతుంటాయి. అరుదుగా గుండెల్లో మంట, అజీర్ణం, వికారం, కడుపు నొప్పి వంటి సమస్యలు కలుగవచ్చు. వీటిలో ఏవైనా వదలకుండా బాధపెడితే వైద్యుడిని సంప్రదించాలి. ఇక అసలు విషయానికి వస్తే... కొందరు వైద్యుడు చెప్పిన మోతాదుకు మించి ఎలాబడితే అలా వాడేస్తుంటారు. జ్వరం వచ్చింది కదా అని డోసేజ్ మరింత వేస్తారు. ఇలా చేస్తే కిడ్నీలు, కాలేయం దెబ్బతినే అవకాశం వుంటుంది. కాబట్టి కోవిడ్ రోగులు ఖచ్చితంగా వైద్యుల పర్యవేక్షణలోనే మందులు వాడాలి. స్వంతంగా నిర్ణయం తీసుకుని ఎలాబడితే అలా వాడకూడదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొట్ట కొవ్వు యమా డేంజర్... కరిగించుకోండి ఇలా..?