Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డయాబెటిస్ నియంత్రణ చిట్కాలు.. లైఫ్ స్టైల్ మారకపోతే కష్టమే...

Diabetes
, బుధవారం, 3 ఆగస్టు 2022 (12:48 IST)
దేశంలో మధుమేహం పెరిగిపోతోంది. ఈ మధుమేహం వ్యాధి నుంచి బయటపడాలంటే.. లైఫ్ స్టైల్ తప్పక మారాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పౌష్టికాహారంతో పాటు వ్యాయామం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మధుమేహాన్ని నియంత్రించేందుకు ఫైబర్‌తో కూడిన ఆహారం చాలా అవసరం. 
 
కానీ మధుమేహం సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా కొన్ని రకాల ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకోవాల్సి వుంటుంది. ముఖ్యంగా ఉడికించిన కోడిగుడ్డు, తృణధాన్యాలు, మిల్లెట్ దోస  వంటివి క్రమంగా తప్పకుండా తీసుకోవాలి. 
 
ఇంకా రోజూ అన్నం తినడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణం పెరుగుతుంది. అన్నానికి బదులుగా రాగి పిండితో చేసిన దోసలను ఆహారంగా తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణం తగ్గుతుంది. ఇంకా పలు రకాల అనారోగ్య సమస్యలు సైతం దూరమవుతాయి. 
 
అలాగే, తృణధాన్యాలతో తయారు చేసిన వంటకాలు కూడా మధుమేహం వ్యాధిగ్రస్తులుకు మేలు చేస్తాయి. డయాబెటిక్ రోగులకు ఇది ఆరోగ్యకరమైన ఆహారంగా చెబుతున్నారు వైద్య నిపుణులు.
 
అలాగే, బ్లాక్ గ్రామ్స్‌ను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్ని ఆహారంలో తీసుకుంటే మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. దీనితోపాటు అలోవెరాను క్రమం తప్పకుండా జ్యూస్‌‌లా తీసుకుంటే..  రక్తంలో చక్కెర పరిమాణం నియంత్రణలో ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

National Watermelon Day 2022: జాతీయ పుచ్చకాయ దినోత్సవం, ఈ పండు ఎందుకు తినాలి?