Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

National Watermelon Day 2022: జాతీయ పుచ్చకాయ దినోత్సవం, ఈ పండు ఎందుకు తినాలి?

National Watermelon Day 2022: జాతీయ పుచ్చకాయ దినోత్సవం, ఈ పండు ఎందుకు తినాలి?
, బుధవారం, 3 ఆగస్టు 2022 (11:41 IST)
జాతీయ పుచ్చకాయ దినోత్సవం ఈ రోజు. పుచ్చకాయలో 90 శాతం నీరు వుంటుంది. ఈ పండుకోసం ప్రత్యేకమైన రోజును ఏర్పాటు చేసారు. పుచ్చకాయ అనేది ప్రపంచవ్యాప్తంగా ఆరగించే పండు. ఇది రుచిని మాత్రమే కాకుండా, చాలా పోషక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అవేమిటో చూద్దాం.
 
1. అతిదాహం, చెమట ద్వారా ఖనిజ లవణాల లోపాలను పుచ్చకాయ తగ్గిస్తుంది. జ్వరంతో బాధపడతున్నవారు పుచ్చకాయ రసంలో తేనె కలిపి సేవిస్తే శారీరక నీరసం తగ్గి శక్తినిస్తుంది.
 
2. మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజూ పుచ్చకాయ తింటుంటే మలబద్ధకం అంతరిస్తుంది. ఎండిపోయే పెదవులు తడిగా ఉంచుతుంది.
 
3. పుచ్చకాయలో ఉన్నన్ని నీళ్ళు మరే పండులోగాని, కాయలోగాని లేవు. మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట, చురుకులు ఉన్నవారికి పుచ్చకాయ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. పుచ్చపండు గింజలు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి యవ్వనంగా కనపడేలా చేస్తాయి. అంతేకాకుండా, ఈ విత్తనాలను తీసుకోవటం వలన చర్మ క్యాన్సర్ మరియు ఇన్ఫెక్షన్ వంటి చర్మ రుగ్మతలకు దూరంగా ఉంచుతుంది.
 
4. పుచ్చకాయ తినడం వలన మగవారిలో స్తంభన సమస్యలు రావని పరిశోధనలు చెబుతున్నాయి. పుచ్చకాయలోని సిట్రులైన్, ఆర్గినైన్ పదార్దాల వలన ఈ సమస్య తగ్గుతుంది.  
 
5. బి విటమిన్లు , పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ నుంచి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా అందుతాయి. బి విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే.. పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. వడదెబ్బ బారినపడి శరీరం నిస్తేజం అయిపోకుండా కాపాడుతుంది. వేడికి కమిలిన చర్మానికి చల్లని పుచ్చకాయ గుజ్జును రాస్తే తిరిగి చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. 
 
6. గ్లాసు పుచ్చకాయ రసంలో స్పూన్‌ తేనె కలిపి ప్రతిరోజు తీసుకుంటే గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులు తగ్గిపోతాయి. పుచ్చపండు గింజలు మెగ్నీషియంను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఈ మూలకం గుండె విధిని మరియు రక్త పీడనాన్ని సమతుల్య పరుస్తుంది. ఇవే కాకుండా గుండె సంబంధిత వ్యాధులు, హైపర్ టెన్షన్‌లను తగ్గించి, జీవక్రియకు సజావుగా జరుగుటలో సహాయపడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బరువు తగ్గడానికి పవర్ యోగా భంగిమలు