Publish Date: Thu, 06 Jun 2019 (10:43 IST)
Updated Date: Thu, 06 Jun 2019 (10:44 IST)
చాలామంది భోజనం చేసేటపుడు కొన్నింటిని నంజుకుని తింటుంటారు. కానీ కొన్ని ఆహారపదార్ధాలను కలిపి కానీ, ఒకదాని తర్వాత ఒకటి గానీ తీసుకోకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా పాలు తాగిన తర్వాత మనం పండ్లు తీసుకుంటుంటాం. కానీ అలా తీసుకోకూడదని వారంటున్నారు.
ఇంకా వేటితో పాటు ఏవీ తీసుకోకూడదంటే..
* పాలు తాగిన వెంటనే ఏ రకమైన మాంసాన్ని తినకూడదు.
* ఇత్తడి పాత్రలో నెయ్యి
* పాలు ఉప్పుతో కలిపి
* మజ్జిగ, పాలు, పెరుగులతో అరటి పండు
* పెరుగుతో చికెన్
* చేపలతో చక్కెర
* దోస, టమోటాలను నిమ్మతో...
* చల్లని, వేడి పదార్ధాలు వెంట వెంటనే...
* వేడి వేడి భోజనం తర్వాత చల్లటి నీరు తీసుకోకూడదు.