Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేసవిలో పిల్లలకు జ్వరం వస్తే... ఇలా చేస్తే...

Advertiesment
వేసవిలో పిల్లలకు జ్వరం వస్తే... ఇలా చేస్తే...
, మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (21:28 IST)
సాధారణంగా సీజన్ మారగానే వాతావరణంలో అనేక రకములైన మార్పులు చోటు చేసుకుంటాయి. అంతేకాకుండా ఒక సీజన్ నుండి మరొక సీజన్ లోకి ప్రవేశించినప్పుడు రకరకాల ఇన్ఫెక్షన్లు దాడి చేస్తాయి. ముఖ్యంగా వేసవికాలంలో పిల్లలు జ్వరంతో ఇబ్బందిపడుతుంటారు. ఆయా కాలాన్ని బట్టి మనం ఆహారంలో మార్పులు చేసుకోవడం వలన కొన్ని రకాల అనారోగ్యాల నుండి మనం తప్పించుకోవచ్చు. పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు తీసుకోలసిన జాగ్రత్తలు, చిట్కాలేమిటో చూద్దాం.
 
1. ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకోని దానిలో ఒక కప్పు వెనిగర్ వేసి బాగా కలిపి, దానిలో ఒక కాటన్ వస్త్రం ముంచి పిండి జ్వరం వచ్చిన వారి నుదురు మీద పెట్టాలి.
 
 2. ఒక కప్పు వేడి నీటిలో ఒక స్పూను తులసి ఆకులను వేసి అయిదు నిముషములు ఉంచి, ఆ నీటిని రోజులో మూడు నుండి నాలుగుసార్లు తాగాలి. ఇది చెమట పట్టుటను ప్రోత్సహించి జ్వరం తగ్గేలా చేస్తుంది.
 
3. అధిక జ్వరం ఉన్నప్పుడు, అరకప్పు నీటిలో ఇరవై ఎండు ద్రాక్షలను వేసి నానబెట్టాలి. బాగా నానాక నీటిలో ఎండు ద్రాక్షను క్రష్ చేయాలి. దీనిలో కొంచెం నిమ్మరసం కలిపి రోజులో రెండు సార్లు తాగడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఎండుద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినాసరే పోరాడి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
 
4. బంగాళదుంప ముక్కలను వెనిగర్లో పది నిముషాలు ఉంచాలి. నుదురుపై ఒక తడి వస్త్రం వేసి దాని మీద బంగాళదుంప ముక్కలను ఉంచాలి. ఇరవై నిమిషాల్లో జ్వరం నుండి ఉపశమనం పొందుతారు.
 
5. జ్వరంతో బాదపడేవారు బియ్యం లేదా బార్లీతో తయారుచేసిన గంజి వ్యాధి నిరోధకతను పెంచుతుంది. మరియు ఎనర్జీని అందిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాలిచ్చే తల్లులు నల్ల నువ్వులు ఆరగిస్తే..