Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆవు నెయ్యిని రోజూ తాగితే కీళ్ల‌లో లూబ్రికేష‌న్ పెరుగుతుందండోయ్..

Advertiesment
ఆవు నెయ్యిని రోజూ తాగితే కీళ్ల‌లో లూబ్రికేష‌న్ పెరుగుతుందండోయ్..
, సోమవారం, 1 ఏప్రియల్ 2019 (13:30 IST)
ఘుమఘుమలాడే నెయ్యి అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. తినాలని ఉన్నా కొంత మంది దూరం పెడతారు. బరువు పెరిగిపోతాం, శరీరంలో క్రొవ్వు పేరుకుపోతుంది, గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తాయి అని భయపడతారు. అలాంటి అపోహలు ఉంటే చెక్ పెట్టండి. నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మన ఆయుర్వేదం చెబుతోంది. 
 
మ‌న‌కు మార్కెట్‌లో రెండు ర‌కాల నెయ్యిలు అందుబాటులో ఉన్నాయి. ఒక‌టి ఆవు నెయ్యి. రెండవది గేదె పాల‌తో త‌యారు చేసే నెయ్యి. అయితే ఆయుర్వేద వైద్యంలో కేవ‌లం ఆవు నెయ్యిని మాత్ర‌మే ఔష‌ధాల ప్ర‌యోగం కోసం వాడుతారు. ఎందుకంటే ఇందులో మ‌న శ‌రీరానికి క‌లిగే పలు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను నయం చేసే గుణాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 
ఆవు నెయ్యి తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. క్యాన్స‌ర్ క‌ణాల‌ను నాశ‌నం చేసే గుణాలు నెయ్యిలో ఉన్నాయి. రోజూ నెయ్యి తాగితే క్యాన్సర్ భారిన పడకుండా ఉండవచ్చు. ఆవు నెయ్యిలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. నెయ్యిని ఆహారంలో కలుపుకుని తింటే మంచిది. 
 
నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని అనేక మంది భావన. అయితే నిజానికి నెయ్యి చెడు కొలెస్ట్రాల్ పెంచదు, మంచి కొలెస్ట్రాల్‌ను మాత్రమే పెంచుతుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఉదయం పరగడుపున ఆవు నెయ్యిని తాగ‌డం వ‌ల్ల మెదడు యాక్టివ్‌గా మారుతుంది. జ్ఞాప‌క‌శ‌క్తి మెరుగుపడుతుంది. 
 
గర్భిణిలైతే నెయ్యిని ప్రతి రోజు తీసుకోవాలంటున్నారు వైద్యులు. ఎందుకంటే ఎదిగే పిండానికి కీలక పోషకాలు అందాలంటే నెయ్యి తప్పనిసరి. నెయ్యి తీసుకోవడం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు, ముడుతలు, మొటిమలు పోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. ఆవు నెయ్యిని రోజూ తాగితే కీళ్ల‌లో లూబ్రికేష‌న్ పెరుగుతుంది. దీని ఫ‌లితంగా కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గంటల తరబడి కూర్చుంటే... అలెర్జీలు తప్పవు.. అరగంట నడవకపోతే..?