జొన్న రోటీ సంపూర్ణ గోధుమ రోటీలకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా మారింది. జొన్న రోటీలో కేలరీలు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రోటీన్, అవసరమైన పోషకాల విలువలు గోధుమల కంటే కంటే ఎక్కువగా ఉంటాయి కనుక వాటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది.
జొన్నలను మితంగా తీసుకోవడం సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. ఇది గ్లూటెన్-రహిత ధాన్యం. జొన్నల్లో ఫైబర్ అద్భుతమైన మూలం, ఇది బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా బరువు పెరగడాన్ని నిరోధిస్తుంది. అది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ, మధుమేహాన్ని క్రమబద్ధీకరించడంలోనూ సహాయపడుతుంది.
జొన్నపి౦డి ఏ ఇతర వ౦టక౦లోనయినా కలుపుకుని తినేయవచ్చు. ఇందులో 70 శాతానికి పైగా పిండిపదార్థం వుంటుంది. పైగా జొన్నలతో చేసిన వంటకాలు తేలిగ్గా జీర్ణమవుతాయి. జబ్బుపడినవారు త్వరగా కోలుకోవడానికి జొన్నలతో చేసిన పదార్థాలను పెట్టడం ఎంతో మంచిది.
అన్ని రకాల జొన్నలూ బాలింతలకు మంచి బలవర్థకమైన ఆహారంగా పనిచేస్తాయి. తగినంత పీచు ఉండడం వల్ల జీర్ణసమస్యలు రాకుండా ఉంటాయి. పోషక విలువలు కూడా జొన్నలోనే ఎక్కువ.