Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మధుమేహం పరీక్షల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? (video)

Advertiesment
మధుమేహం పరీక్షల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? (video)
, శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (14:25 IST)
తెలియక చేస్తే పొరపాటు. మరి తెలిసి చేస్తే? మధుమేహం విషయంలో ఎంతోమంది చేస్తున్నదిదే! ప్రస్తుతం మధుమేహం గురించి మనకు అంతో, ఇంతో బాగానే తెలుసు. ఇది ఒకసారి వచ్చిందంటే పూర్తిగా నయమయ్యే సమస్య కాదనే సంగతి తెలుసు. మందులతో, జీవనశైలి మార్పులతో దీన్ని నియంత్రణలో ఉంచుకోవటం తప్పించి మరో మార్గం లేదని తెలుసు.
 
మధుమేహం పరీక్షల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు
 
*చాలా మంది ఉదయం లేవగానే తొలిసారి వచ్చిన మూత్రాన్ని పరీక్షకు ఇస్తుంటారు. నిజానికి ఒకసారి మూత్రం పోశాక, అరగంట తర్వాత వచ్చే మూత్రాన్ని పట్టాలి. లేదంటే టిఫిన్ గానీ భోజనం గానీ చేసిన తర్వాత వచ్చే మూత్రాన్ని గ్లూకోజు పరీక్షకు ఇవ్వాలి. అయితే మూత్రంలో గ్లూకోజు ఉన్నంత మాత్రాన అది మధుమేహం కాదు.

రక్తపరీక్షతోనే సమస్య కచ్చితంగా తేలుతుంది. ఇది చాలా ముఖ్యం. కొన్నిసార్లు గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు, అలాగే విటమిన్ సి, యాంటీబయోటిక్ మందులు, టెట్రాసైక్లిన్ వంటివి తీసుకునేవారికి మూత్రపరీక్షలో గ్లూకోజులాగా కనబడొచ్చు. రీనల్ గ్లైకోసురియా సమస్యతో బాధపడేవారికి గ్లూకోజు నార్మల్‌గా లేదా తక్కువగా ఉన్నా కూడా మూత్రంలో గ్లూకోజు ఉండొచ్చు. ఇలాంటి వారికి మధుమేహ చికిత్స చేస్తే గ్లూకోజు బాగా పడిపోతుంది.
 
*పరగడుపున (రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఏమీ తినకుండా) చేస్తే రక్త పరీక్షను ఉదయం 6 గంటల నుంచి 8 గంటల లోపే చేయించుకోవాలి. కానీ కొందురు ఉదయం 10 గంటలకు వచ్చి పచ్చి మంచి నీళ్లు కూడా తాగలేదు. పరీక్ష చేయండి అని అంటుంటారు. ఇందులో గ్లూకోజు మోతాదులు కచ్చితంగా తెలియవు. ఈ సమయానికి ఒంట్లో హార్మోన్లు విడుదలై గ్లూకోజు మోతాదులను సరిచేస్తాయి. అలాగే తిన్నాక చేసే పరీక్షను భోజనం చేసిన 2 గంటల తర్వాతే చేయాలి.
 
*3 నెలల కాలంలో రక్తంలో గ్లూకోజు మోతాదుల సగటును తెలిపే హెచ్‌బీఏ1సీ పరీక్షను ఎప్పుడైనా చేయించుకోవచ్చు. ఇది ఉందనే అర్థం. చికిత్స తీసుకుంటున్నప్పుడు 7% లోపు ఉండేలా చూసుకోవటం ముఖ్యం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

15న గురజాడ ''దేశభక్తి'' గేయంపై ఆలాపన పోటీలు