ఎండలు మండుతున్నాయి. ఈ ఎండలకు బయటకు రాకూడదు అనుకున్నప్పటికీ కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో ఎండనబడి తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా తిరిగినప్పుడు కొందరు వడదెబ్బకు గురవుతారు. వడదెబ్బ లక్షణాలు ఎలా వుంటాయంటే... చాలా అధిక శరీర ఉష్ణోగ్రత వస్తుంది. మానసిక మతిమరుపు, మూర్ఛలు, గందరగోళం, చిరాకు లేదా మానసిక ప్రవర్తన భిన్నంగా వుంటుంది.
వికారం- వాంతులు అవుతాయి. చర్మం ఎర్రబడుతుంది. శ్వాస తీసుకోవడం వేగవంతంగా వుంటుంది. శరీరాన్ని చల్లబరచడానికి గుండె అకస్మాత్తుగా వేగంగా కొట్టుకోవడం వలన అధిక పల్స్ రేటు నమోదవుతుంటుంది. తీవ్రమైన తలనొప్పి వస్తుంది.
హీట్‌స్ట్రోక్‌ను ఎలా నివారించాలి?
బయటకు వెళ్లే ముందు సన్‌స్క్రీన్‌ని అప్లై చేయాలి. తలపై కండువా లేదా టోపీని కప్పుకోవడం, కళ్ళను రక్షించుకోవడానికి కళ్లద్దాలు ధరించడం మర్చిపోవద్దు. సౌకర్యవంతమైన వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.
మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. నీళ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తాగాలి. పార్క్ చేసిన కారులో పిల్లలను లేదా పెంపుడు జంతువులను లాక్ చేసి ఉంచవద్దు. దీనివల్ల పిల్లలు- పెంపుడు జంతువులు మరణించిన ఘటనలు జరిగాయి.
సూర్యుడు నడినెత్తిన వున్నప్పుడు సాధ్యమైనంతవరకు ఎలాంటి కఠినమైన శారీరక శ్రమను చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్నం సమయాల్లో బయటకు వెళ్లడం మానుకోండి. ఎందుకంటే అప్పుడు ఉష్ణోగ్రత గరిష్టంగా ఉంటుంది. సాయంత్రాలు లేదా ఉదయాన్నే పనులను చక్కబెట్టుకోండి.
హీట్ స్ట్రోక్‌కి చికిత్స ఏమిటి?
వడదెబ్బ పరిస్థితిని బట్టి డాక్టర్ తగిన మందులను సూచించవచ్చు. శ్వాసకోశ బాధ, మెదడు రుగ్మత లేదా మూత్రపిండాలు లేదా కాలేయం దెబ్బతినడం వంటి ఏవైనా సమస్యలు ఉంటే, పరిస్థితులు తీవ్రత మరియు లక్షణాల ప్రకారం చికిత్స అందిస్తారు.