Article General Knowledge %e0%b0%87%e0%b0%b5%e0%b0%bf %e0%b0%ae%e0%b1%80%e0%b0%95%e0%b1%81 %e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%b8%e0%b0%be %e0%b0%aa%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%b2%e0%b1%82 109080300085_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇవి మీకు తెలుసా పిల్లలూ...?!

Advertiesment
బాలప్రపంచం
FILE
* కొండ నాలుకను ఆంగ్లంలో "జూజెలె" అంటారు. అంటే చిన్న ద్రాక్ష అనే అర్థం వచ్చే లాటిన్ పదం నుంచి ఈ జూజెలెను తీసుకున్నారట.

* రెండు కనుబొమల మధ్యా దూరం లేకుండా ఒకదానికొకటి కలిసిపోయి ఉండే పరిస్థితిని "యూనీ బ్రో" లేదా "మోనో బ్రో" అని అంటారట.

* ప్రపంచవ్యాప్తంగా పదివేల రకాలకు పైగానే టొమోటోలు ఉన్నాయట.

* డార్ట్‌బోర్డులో ఉండే బుల్స్ ఐ భూమి నుంచి సరిగ్గా ఐదడుగుల ఎనిమిది అంగుళాల ఎత్తులో మాత్రమే ఉండాలట.

* 1894వ సంవత్సరం నాటికి అమెరికా దేశం మొత్తంమీదా నాలుగంటే నాలుగే మోటారు వాహనాలు ఉండేవట.

* చెద పురుగులు మామూలుగా ఉన్నప్పటికంటే, చెవులు అదిరే ధ్వనితో సంగీతం వింటున్నప్పుడు చెక్కను వేగంగా తినేయగలవని ఒక అధ్యయనం చెబుతోంది.

* ఎలిఫెంట్ సీల్ అనే రకం చేపలు సముద్రంలో సబ్‌మెరైన్లు కూడా వెళ్లలేనంత లోతుల్లోకి వెళ్లగలవు.

* గబ్బిలాలకు కూడా బొటన వేలు ఉంటుంది. టర్కీ కోడి గుడ్లు పెట్టే గూడును "క్లచ్" అని అంటారు. తేనెటీగ రక్తం గడ్డకట్టదట. నెమలి ఈక 60 అంగుళాలదాకా పెరుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu