ఇవి మీకు తెలుసా పిల్లలూ...?!
* కొండ నాలుకను ఆంగ్లంలో "జూజెలె" అంటారు. అంటే చిన్న ద్రాక్ష అనే అర్థం వచ్చే లాటిన్ పదం నుంచి ఈ జూజెలెను తీసుకున్నారట.* రెండు కనుబొమల మధ్యా దూరం లేకుండా ఒకదానికొకటి కలిసిపోయి ఉండే పరిస్థితిని "యూనీ బ్రో" లేదా "మోనో బ్రో" అని అంటారట.* ప్రపంచవ్యాప్తంగా పదివేల రకాలకు పైగానే టొమోటోలు ఉన్నాయట.* డార్ట్బోర్డులో ఉండే బుల్స్ ఐ భూమి నుంచి సరిగ్గా ఐదడుగుల ఎనిమిది అంగుళాల ఎత్తులో మాత్రమే ఉండాలట.* 1894వ సంవత్సరం నాటికి అమెరికా దేశం మొత్తంమీదా నాలుగంటే నాలుగే మోటారు వాహనాలు ఉండేవట.* చెద పురుగులు మామూలుగా ఉన్నప్పటికంటే, చెవులు అదిరే ధ్వనితో సంగీతం వింటున్నప్పుడు చెక్కను వేగంగా తినేయగలవని ఒక అధ్యయనం చెబుతోంది.* ఎలిఫెంట్ సీల్ అనే రకం చేపలు సముద్రంలో సబ్మెరైన్లు కూడా వెళ్లలేనంత లోతుల్లోకి వెళ్లగలవు.* గబ్బిలాలకు కూడా బొటన వేలు ఉంటుంది. టర్కీ కోడి గుడ్లు పెట్టే గూడును "క్లచ్" అని అంటారు. తేనెటీగ రక్తం గడ్డకట్టదట. నెమలి ఈక 60 అంగుళాలదాకా పెరుగుతుంది.