Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2019లో టాప్ 10 మూవీస్ - కనకవర్షం కురిపించిన చిత్రాలు

2019లో టాప్ 10 మూవీస్ - కనకవర్షం కురిపించిన చిత్రాలు
, గురువారం, 26 డిశెంబరు 2019 (16:43 IST)
2019 సంవత్సరం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ సంవత్సరంలో తెలుగు చిత్రపరిశ్రమకు ఆశించిన విజయాలు దక్కలేదు. పలు చిత్రాలు భారీ బడ్జెట్‌తో నిర్మించడం జరిగింది. ఇలాంటి చిత్రాలు విడుదలై కొన్ని నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంటే, మరికొన్ని చిత్రాలు సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ఈ రెండు రకాల చిత్రాలు మాత్రం కలెక్షన్ల పరంగా దుమ్మరేపాయి. అలా 2019లో విడుదలై అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల్లో మొదటి పది చిత్రాలను పరిశీలిస్తే, 
 
1. సాహో 
బాహుబలి సిరీస్ తర్వాత హీరో ప్రభాస్ నటించిన చిత్రం "సాహో". ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టి సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించగా, యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహించారు. హాలీవుడ్ స్థాయిలో నాలుగు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 433 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ చిత్రం ఒక్క తెలుగులో మినహా ప్రపంచ వ్యాప్తంగా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్ల పరంగా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు. ఫలితంగా రూ.433.06 కోట్లను వసూలు చేసింది. 
 
2. సైరా నరసింహా రెడ్డి 
మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రంగా వచ్చిన చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. భారతదేశ తొలి స్వాతంత్ర్య సమరయోధుడు సైరా నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. చిరంజీవి హీరోగా నటించగా, నయనతార, తమన్నాలు హీరోయిన్లు కాగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్, జగపతిబాబు, కిచ్చా సుధీప్, విజయ్ సేతుపతి తదితర నటీనటులు ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. చిరంజీవి తనయుడు, హీరో రామ్ చరణ్ తన సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే, ఈ చిత్రం రూ.250 కోట్లను వసూలు చేసినప్పటికీ.. చిత్ర నిర్మాతతో పాటు.. బయ్యర్లను తీవ్ర నష్టాలకు గురిచేసిందనే టాక్ ఉంది. 
 
3. మహర్షి 
ప్రిన్స్ మహేష్ బాబు నటించిన చిత్రం "మహర్షి". వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పీవీవీ సినిమాస్‌లు కలిసి నిర్మించాయి. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటించగా, అల్లరి నరేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్లు నటించారు. ఈ చిత్రం మంచి విజయంతో ప్రపంచ వ్యాప్తంగా రూ.175 కోట్లను వసూలు చేసింది.
webdunia
 
4. ఎఫ్-2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) 
విక్టరీ వెంకటేష్ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌లు కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం "ఎఫ్-2". శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో దిల్ రాజు నిర్మించారు. ఇందులో తమన్నా, ఇషా రెబ్బాలు హీరోయిన్లు. 2019 సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాలన్నింటిలోకెల్లా మొదటిస్థానాన్ని కైవసం చేసుకున్న చిత్రం. సూపర్ డూపర్ హిట్ టాక్‌తో కడుపుబ్బ నవ్విస్తూ ఈ చిత్రం ఆలరించింది. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం నిర్మాతకు కనకవర్షం కురిపించింది. ఈ చిత్రం ఏకంగా రూ.137.6 కోట్లను వసూలు చేసింది. 
 
5. వినయ విధేయ రామ 
బోయపాటి శ్రీను - రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం "వినయ విధేయ రామ". సంక్రాంతికి విడుదలై ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రం కేవలం 97.9 కోట్ల రూపాయల గ్రాస్‌ను రాబట్టింది. చెర్రీ సరసన కియారా అద్వానీ నటించగా, వివేక్ ఓబెరాయ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. 
 
6. ఇస్మార్ట్ శంకర్ 
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ కెరీర్‌కు ఈ చిత్రం ఓ టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతూ వచ్చిన పూరీ ఈ చిత్రంతో మళ్లీ విజయాన్ని రుచిచూశాడు. హీరో రామ్, నభా నటేష్, నిధి అగర్వాల్‌లు జంటగా నటించిన ఈ చిత్రం జూలై 18వ తేదీన విడుదలై, ఎవరూ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. పైగా అతి తక్కువ బడ్జెట్‌తో ఈ చిత్రం నిర్మితమై కనకవర్షం కురిపించింది. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ దర్శకత్వం చేయడమేకాకుండా హీరోయిన్ చార్మీతో కలిసి నిర్మించి, మంచి లాభాలతో పాటు చాలా రోజులకు ఓ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
webdunia
 
7. మజిలి 
నిజ జీవితంలో భార్యాభర్తలుగా ఉన్న అక్కినేని దంపతులు (అక్కినేని నాగచైతన్య - అక్కినేని సమంత)ల కలిసి నటించిన చిత్రమే "మజిలి". శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్దిలు సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్ 5వ తేదీన విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్ల రూపాయలను (రూ.70 కోట్ల గ్రాస్) వసూలు చేసింది. ఈ చిత్రం నాగ చైతన్యకు ఓ విజయాన్ని అందించింది. 
 
8. జెర్సీ 
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం "జెర్సీ". క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ అనే నిర్మాణ సంస్థ నిర్మించింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈచ ిత్రం సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించింది. ఏప్రిల్ 19వ తేదీన విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం రూ.51.70 కోట్లను వసూలు చేసింది.
webdunia
 
9. వెంకీ మామ 
ఈ యేడాదిలో విక్టరీ వెంకటేష్ నటించిన రెండో మల్టీస్టారర్ చిత్రం 'వెంకీ మామ'. సంక్రాంతికి వరుణ్ తేజ్‌తో కలిసి సందడి చేసిన వెంకీ.. యేడాది ఆఖరులు తన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి వెంకీ మామగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. డిసెంబరు 13వ తేదీన విడుదలైన ఈ చిత్రం డిసెంబరు 25వ తేదీ వరకు బాక్సాఫీస్ వద్ద రూ.45 కోట్లను వసూలు చేసింది. 
 
10. గద్దలకొండ గణేష్ 
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నటించిన చిత్రం "గద్దలకొండ గణేష్". ఈ చిత్రానికి తొలుత వాల్మీకి అనే పేరు పెట్టారు. అయితే, వాల్మీక సామాజికవర్గం కోర్టుకెక్కడంతో ఈ చిత్రం పేరును విడుదలకు ఒక రోజు ముందు మార్చారు. అయినప్పటికీ మంచి టాక్‌ను సొంతం చేసుకుని కలెక్షన్ల వర్షం కురిపించిది. వరుణ్ తేజ్ సినీ కెరీర్‌లో మంచి కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలించింది. 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించగా, ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. తక్కువ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం రూ.42.5 కోట్లను వసూలు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2020 విశేషాలు ఏమిటి? ప్రపంచంలో ఏమేం జరగబోతున్నాయి?