Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్కిల్ ఇండియా డిజిటల్ అన్ని నైపుణ్యాలను ఏకతాటిపైకి తెచ్చే అద్భుతమైన వేదిక: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్

image
, గురువారం, 14 సెప్టెంబరు 2023 (19:03 IST)
ప్రతి భారతీయుడికి నాణ్యమైన నైపుణ్యాభివృద్ధి అందాలి. నేర్చుకున్న నైపుణ్యంతో వారికి సరైన అవకాశాలు రావాలి. దీంతోపాటు నేర్చుకున్నవారికి వ్యవస్థాపక మద్దతు లభించేలా చూడాలి. అందుకోసమే స్కిల్ ఇండియా డిజిటల్(SID)ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు గౌరవనీయులు కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్. దేశంలో వ్యక్తుల యొక్క నైపుణ్యాలు, విద్య, ఉపాధి మరియు వ్యవస్థాపకత ల్యాండ్‌స్కేప్‌ను సమన్వయం చేయడం ఈ స్కిల్ ఇండియా డిజిటల్ యొక్క లక్ష్యం. నైపుణ్య కోర్సులు, ఉద్యోగావకాశాలు, వ్యవస్థాపకత మద్దతు కోసం మెరుగైన అవకాశాలు, ఉజ్వల భవిష్యత్తును కోరుకునే మిలియన్ల మంది భారతీయుల ఆకాంక్షలు మరియు కలలను ఈ ప్లాట్‌ఫారమ్ ప్రతిబింబిస్తుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత & ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు.
 
స్కిల్ ఇండియా డిజిటల్ అనేది భారతదేశం యొక్క నైపుణ్యం, విద్య, ఉపాధి మరియు వ్యవస్థాపకత పర్యావరణ వ్యవస్థ కోసం రూపొందించిన ఒక అద్భుతమైన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI). ఇది డిజిటల్ టెక్నాలజీ మరియు ఇండస్ట్రీ 4.0 నైపుణ్యాలపై దృష్టి సారిస్తుంది. తద్వారా నైపుణ్యాభివృద్ధిని మరింత వినూత్నంగా, అందుబాటులోకి తీసుకురావడానికి వ్యక్తిగతీకరించడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల నియామకాన్ని వేగవంతం చేసేందుకు, జీవితకాల అభ్యాసాన్ని సులభతరం చేసేందుకు ఒక అత్యాధునిక ప్లాట్‌ఫారమ్ ఏర్పడుతుంది. డిజిటల్ నైపుణ్యాలు మరియు డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించడానికి
 
DPI ఎంతగానో ఉపయోగపడతుంది. మరోవైపు డిజిటల్ ఎకానమీని నిర్మించడానికి G20 ఫ్రేమ్‌వర్క్‌ లో వ్యక్తీకరించబడిన దృష్టితో ఈ ప్లాట్‌ఫారమ్ సంపూర్ణంగా సరిపోతుంది. ఇది అన్ని ప్రభుత్వ నైపుణ్య మరియు వ్యవస్థాపకత కార్యక్రమాల కోసం రూపొందించిన సమగ్ర సమాచార గేట్‌వే. అంతేకాదు కెరీర్ పురోగతి మరియు జీవితకాల అభ్యాసం కోసం పౌరులకు గో-టు హబ్ లాంటి వ్యవస్థ.
 
ఈ సందర్భంగా గౌరవనీయులు, కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, స్కిల్ ఇండియా డిజిటల్ అనేది అన్ని నైపుణ్య కార్యక్రమాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఉపయోగించే ఒక అత్యాధునిక వేదిక. గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు నైపుణ్యాల మధ్య ఉన్న అంతరాలను పరిష్కరించడానికి భారతదేశం యొక్క విజయవంతమైన G20 ప్రెసిడెన్సీకి ఇది కేంద్రబిందువు అని ఆయన అన్నారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను రూపొందించే దిశగా మరో ముందడుగు వేస్తూ, ఎమ్ఎస్డీఈ భారతదేశంలోని విభిన్న జనాభా యొక్క నైపుణ్య అవసరాలను పరిష్కరించడానికి ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫారమ్‌ను సృష్టించింది. స్కిల్ ఇండియా డిజిటల్ అనేది మన డెమోగ్రాఫిక్ డివిడెండ్‌ను ఉపయోగించుకోవడం మరియు భారతదేశాన్ని గ్లోబల్ స్కిల్స్ హబ్‌గా స్థాపించే దిశగా మరో అడుగు అని ఆయన అన్నారు. లెర్నింగ్ మరియు స్కిల్ డెవలప్‌మెంట్‌లో విప్లవం, స్కిల్ ఇండియా డిజిటల్ అందరికీ, ఎక్కడైనా, ఎప్పుడైనా నైపుణ్యాన్ని కలిగిస్తుంది అని ఆయన అన్నారు.
 
G20 సమ్మిట్ అద్భుతంగా విజయవంతమైన సందర్భంగా గౌరవనీయులు శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. సమ్మిట్‌లోని అత్యంత ముఖ్యమైన ఒప్పందాలలో ఒకటి DPI. స్కిల్ ఇండియా డిజిటల్ ఖచ్చితంగా యువతకు అత్యంత ముఖ్యమైన DPIలలో ఒకటి. ఇది న్యూ ఇండియా - స్కిల్ ఇండియా & డిజిటల్ ఇండియా కోసం మన ప్రియతన ప్రధాని గారు భావించిన రెండు ముఖ్యమైన భాగాల కలయిక. ఇవి శక్తివంతమైన స్కీమ్‌లు, భవిష్యత్తులో సిద్ధంగా ఉన్న నైపుణ్యాలతో యువతకు నైపుణ్యం కల్పించడమే ఏకైక లక్ష్యం. ఇది అనేక అవకాశాలను సృష్టించడంలో సహాయపడుతుంది. కరోనా తర్వాత ఉన్న డిజిటల్ నైపుణ్యాల గురించి విపరీతమైన అవగాహన ఉంది. స్కిల్ ఇండియా డిజిటల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మరియు భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న వర్క్‌ఫోర్స్‌ను ఎనేబుల్ చేస్తుందని ఆయన తెలిపారు.
 
స్కిల్ ఇండియా డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా కలిగే ప్రయోజనాలు మరియు ఉపయోగాలు:
1. ఆధార్/ఏఐ ఆధారిత ఫేసియల్ అధంటికేషన్
2. డిజిటల్ వెరిఫైయబుల్ క్రెడెన్షియల్స్ (DVC)
3. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు మెషీన్ లెర్నింగ్ (ML) రికమండేషన్స్
4. ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ
5. డిజిటల్ లెర్నింగ్
6. సిటిజెన్ సెంట్రిక్ అప్రోచ్
7. మొబైల్ ఫస్ట్ అప్రోచ్
8. స్కేల్ మరియు స్పీడ్
9. సెక్యురిటీ విధివిధానాలు
10. పరస్పర చర్య
11. వాట్సాప్ చాట్ బోట్
12. సరళతర వ్యాపార నిర్వహణ
కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ & ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ గారు దేశంలో మార్పు మరియు సాధికారతను వేగవంతం చేయడానికి ఉద్దేశించబడిన స్కిల్ ఇండియా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ ను రూపొందించిన టెక్నికల్ టీమ్ తో మాట్లాడారు. ప్లాట్‌ఫారమ్‌లోని ప్రతి విభాగం విభిన్న పౌర అవసరాలను ఎలా తీరుస్తుందో ఈ బృందం ఆయనకు వివరించింది.
 
స్కిల్ ఇండియా డిజిటల్ యూజర్ ఫ్రెండ్లీ అనే నిబద్ధతతో ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇది వివిధ పరికరాలకు అనువర్తించే సులభమైన ఇంటర్‌ఫేస్‌ను అందించడం ద్వారా ఇప్పటికే ఉన్న అడ్డంకులను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. విభిన్న నేపథ్యాలకు చెందిన వ్యక్తులు తమ వద్ద ఉన్న సాంకేతికతతో సంబంధం లేకుండా అప్రయత్నంగా ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేసేందుకు ఇది అవకాశాన్ని ఇస్తుంది. అనేక భాషలతో కూడిన దేశంలో, స్కిల్ ఇండియా డిజిటల్ బహుళ భారతీయ భాషలకు మద్దతు ఇవ్వడం ద్వారా అంతరాలను కూడా తొలగిస్తోంది. అన్నింటికి మించి అందరినీ కలుపుకొని పోవడాన్ని మరియు విభిన్న అభ్యాస వాతావరణాన్ని అందిస్తోంది. ఆధార్ ఆధారిత ఈ-కైవీసీతో పాటు సురక్షిత యాక్సెస్ కోసం ఒక ప్రధాన పురోగతి వచ్చింది. ఈ దృఢమైన ధృవీకరణ ప్రక్రియ స్కిల్ ఇండియా డిజిటల్‌కు పునాది. ఇందులో పాల్గొనేవారు అద్భుతమైన ప్రయోజనాలు పొందగలరని ఇది నిర్ధారిస్తుంది.
 
ఈ ప్లాట్‌ఫారమ్ యొక్క విధానం ఆధునిక మొబైల్ విధానానికి అనుగుణంగా ఉంటుంది. ఇది హ్యాండ్‌హెల్డ్ పరికరాల ద్వారా నిరంతరాయ అభ్యాస అనుభవాలను నిర్ధారిస్తుంది. అంతేకాకుండా సాంప్రదాయ అభ్యాస పద్ధతులను మారుస్తుంది. వినియోగదారులను ఎప్పుడైనా మరియు ఎక్కడైనా ప్లాట్‌ఫారమ్ వనరులతో నిమగ్నమయ్యేలా చేస్తుంది.
 
ప్రస్తుతమున్న డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌లో, స్కిల్ ఇండియా డిజిటల్ ద్వారా వ్యక్తి నైపుణ్యాలు మరియు అర్హతలను ప్రదర్శించడానికి ఒక అద్భుతమైన విధానాన్ని ప్రారంభించింది. ఈ ఆవిష్కరణ డిజిటల్‌గా ధృవీకరించబడిన క్రెడెన్షియల్ రూపంలో వస్తుంది. ఇది అర్హతలు ప్రదర్శించే విధానాన్ని ప్రాథమికంగా మారుస్తుంది. స్కిల్ ఇండియా డిజిటల్ సురక్షితమైన, ట్యాంపర్ ప్రూఫ్ మరియు ధృవీకరించదగిన పరిష్కారాన్ని అందించడానికి డిజిటల్ టెక్నాలజీ శక్తిని ఉపయోగించుకుంది. అంతేకాకుండా డిజిటల్‌గా ధృవీకరించబడిన క్రెడెన్షియల్ వినియోగదారులకు వారి అర్హతలు, అనుభవాలు మరియు ధృవపత్రాలను ఒక డిజిటల్ ఫార్మాట్‌లో అందించేందుకు అధికారం ఇస్తుంది.
 
అంతేకాకుండా, స్కిల్ ఇండియా డిజిటల్ వ్యక్తిగతీకరించిన క్యూఆర్ కోడ్‌ల ద్వారా డిజిటల్ సీవీలను పరిచయం చేస్తుంది. దీనిద్వారా సాధారణ స్కాన్‌తో, యజమానులు లేదా భాగస్వాములు ఒక వ్యక్తి యొక్క నైపుణ్యాలు, అర్హతలు, అనుభవాల డిజిటల్ పోర్ట్‌ ఫోలియోను యాక్సెస్ చేయవచ్చు. స్కిల్ ఇండియా డిజిటల్ (SID) రంగంలో, సమయానుకూలమైన అప్‌డేట్‌ల ఏకీకరణ ఒక అనివార్యమైన అంశంగా పరిణామం చెందింది. స్కిల్ ఇండియా డిజిటల్ యొక్క ముఖ్య బలాలలో ఇది కూడా ఒకటి. ఇది శిక్షణ మరియు నైపుణ్య అభివృద్ధికి సమగ్ర విధానంగా మారింది. ఈ ప్లాట్‌ఫారమ్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు, అలాగే వివిధ శాఖలు ప్రారంభించిన అన్ని శిక్షణా కార్యక్రమాలను కలిగి ఉండేలా రూపొందించబడింది. స్కిల్ ఇండియా డిజిటల్‌లో ప్రభుత్వ శిక్షణా కార్యక్రమాలను ఏకీకృతం చేయడం ద్వారా, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల కోసం ఏకీకృత మరియు కేంద్రీకృత కేంద్రాన్ని రూపొందించడానికి ప్లాట్‌ఫారమ్ ప్రయత్నిస్తుంది. విభిన్న రంగాలు మరియు ప్రాంతాలలో నైపుణ్యాన్ని పెంపొందించడంలో వివిధ ప్రభుత్వ సంస్థలు చురుకుగా పాల్గొంటున్నాయని గుర్తించడంలో ఈ విధానం రూపుదిద్దుకుంది.
 
స్కిల్ ఇండియా డిజిటల్ స్కిల్లింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఈ ఫీచర్లను అమలు చేయడం వల్ల భారతదేశంలోని నైపుణ్యత ల్యాండ్‌స్కేప్‌లో విప్లవాత్మక మార్పులు వస్తాయి, మెరుగైన ప్రాప్యత, వ్యక్తిగతీకరించిన అభ్యాస అనుభవాలు, క్రమబద్ధీకరించిన ధృవీకరణ ప్రక్రియలు మెరుగైన కెరీర్ మార్గదర్శకత్వానికి అనుసంధానించబడతాయి. ఇది అభ్యాసకులు సంబంధిత నైపుణ్యాలను పొందేందుకు, పరిశ్రమల పోకడలతో అప్‌డేట్‌గా ఉండటానికి మరియు భారతదేశ శ్రామికశక్తి అభివృద్ధికి సమర్థవంతంగా దోహదపడేందుకు వీలు కల్పిస్తుంది.
 
ఈ ప్రారంభం సందర్భంగా, AICTE, CBSE, NIELIT, Infosys, Microsoft, AWS (Amazon), RedHat, Wadhwani Foundation, UNICEF, ప్రైమ్, SAP, టెక్ మహీంద్రా ఫౌండేషన్ లాంటి సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. దీనివల్ల ఫ్యూచర్ స్కిల్స్‌‌తో సహా డిజిటల్ నైపుణ్యాన్ని పెంపొందించడం, పరిశ్రమలో భాగస్వామ్యాన్ని పెంపొందించడం, అభ్యర్థులకు ఉద్యోగాల కల్పన జరుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనసేన ఎరుపు - టీడీపీ పసుపు.. రెండూ కలిస్తే కాషాయం : ఆర్ఆర్ఆర్