Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లక్కీ వెదురు మొక్కను ఇంట్లో వుంచుకుంటే..? (video)

Advertiesment
లక్కీ వెదురు మొక్కను ఇంట్లో వుంచుకుంటే..? (video)
, శనివారం, 9 జనవరి 2021 (18:21 IST)
Fengshui
లక్కీ వెదురు మొక్కను ఇంట్లో వుంచుకుంటే ఈతిబాధలు తొలగిపోతాయి. ఇంటికి తూర్పు మూలలో వెదురు మొక్క ఉంచడానికి ఉత్తమమైన ప్రదేశం. దీనిని ప్రత్యక్ష సూర్యకాంతి క్రింద ఉంచరాదు.వెదురు మొక్కను పారదర్శక కంటైనర్లో ఉంచాలి, తద్వారా దాని మూలాలను చూడవచ్చు. ఎర్ర-రంగు బ్యాండ్‌తో ఈ మొక్కలను దగ్గరకు కట్టాలి. రంగులో పసుపు లేదా ముదురు ఆకుపచ్చ కాండాలతో ఉన్న వెదురు మొక్కను ఉపయోగించడం మానుకోవాలి. 
 
ఇంటిలో సింహా ద్వారానికి ఎదురుగా ఉంచితే వీధిపోటు, నరదృష్టి , కంటిదృష్టి, చెడు ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని కలిగించేందుకు లక్కీ వెదురు మొక్క బాగా పనికొస్తుంది. ఈ మొక్క సంపదను ఆకర్షిస్తుంది. ఈ చెట్టు ఎలాగైతే పెరుగుతుందో అలాగే దీని మీ వ్యాపారం కూడా పెరుగుతుంది. 
 
వ్యాపార సంస్థలలో నరదృష్టి నివారణకు, ధనం ఆకర్షణకు, వ్యాపారభివృద్ధికి ఇది చాలా మంచిది. పిల్లలు చదువు కొనే టేబుల్ దగ్గర ఉంచితే మంచి తెలివితేటలు, చదువుపై శ్రద్ధ పెరుగుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు. లక్కీ బాంబూతో సానుకూల ఫలితాలు మెరుగ్గా వున్నాయని.. దంపతుల మధ్య అన్యోన్యత చేకూరుతుంది. ఇంకా గృహంలోకి ప్రతికూల శక్తులను ఇది తొలగిస్తుందని వారు చెప్తున్నారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శనివారం పూట బూజు దులపడం చేస్తే..? అమ్మవారి ముందు లవంగం..?