Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎలాంటి దుస్తులు కొనాలో తెలియడం లేదా..?

Advertiesment
ఎలాంటి దుస్తులు కొనాలో తెలియడం లేదా..?
, శనివారం, 2 ఫిబ్రవరి 2019 (17:01 IST)
నాగరికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో యువతలు సరికొత్త భావాలతో పాటు వైవిధ్యభరితమైన డ్రెసింగ్స్‌ వైపు మారిపోయారు. అయితే ఈ వెరైటీ హద్దులు దాటి వింత పోకడలకు ఆస్కారమివ్వకూడదు. ముఖ్యంగా మన శరీర రంగుకు, ఆకృతికి సరిపడే దుస్తులు ఏంటనే అంశాలను పరిగణనలోనికి తీసుకుని వాటిని ఎంచుకుంటే ఆకర్షణీయంగా కనబడారు.
 
నప్పే దుస్తులు ఏంటా అని డీలా పడిపోకండి... నేటి ఆధునిక ప్రపంచంలో మీరు మెచ్చే, మీకు నప్పే డిజైన్లు ఎన్నో ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా మీకు సరిపడే దుస్తులను ఎన్నుకోవటమే. జీన్స్, స్కర్ట్స్ ధరించే వారి విషయానికి వస్తే... సాధారణంగా ఎదుటి వారి దృష్టి బాటమ్‌ల కన్నా టాప్స్ పైనే ఉంటుంది. అది స్కర్ట్స్, జీన్స్ ఏ టాప్ అయినా కాని వేసుకోవడానికి వీలుగా ఒకటి రెండు కొనిపెట్టుకోండి. వాటి మీద రకరకాల డిజైన్‌లలో, ప్రింట్లలో, రంగుల్లో టాప్స్ కొనుక్కుంటే సరిపోతుంది.
 
బాగున్నాయి కదాని ఒకే రకమైన డిజైన్స్‌తో ఉన్నవాటిని కొనవద్దు.. ఒక్కో డిజైన్‌ నుంచి ఒకటి మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ ఒకే డిజైన్లను ధరించినట్లైతే చూసేవారికి మీ వస్త్రధారణ మూసగా కనబడుతుంది. అలాగే కాస్త వదులుగా ఉన్నా.. బిగుతుగా ఉన్నా నచ్చాయి కదా... అని తీసుకోకూడదు. మీకు సౌకర్యవంతంగా ఉండే దుస్తులను మాత్రమే ఎంచుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జలుబు చేస్తే ఎందుకు అలా ఉంటుందో తెలుసా..?